అభివృద్ధిలోమెట్‌పల్లిని అగ్రగామి చేస్తా


Tue,February 19, 2019 12:59 AM

మెట్‌పల్లి టౌన్:మెట్‌పల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. పట్టణ అనుబంధ గ్రామమైన ఒకటో వార్డు, రేగుంటకు ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారి సోమవారం గ్రామానికి వచ్చిన సందర్భంగా విద్యాసాగర్‌రావుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రాదన కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి పూలమాలు వేశారు. అసిస్టెంట్ ము న్సిపల్ నిధుల నుంచి మంజూరైన రూ. 2.13 కో ట్లతో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆ విష్కరించి పనులు ప్రారంభించారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో ప్రభు త్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు మారో మారు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారన్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించి మారోసారి పార్లమెంట్‌కు పంపాలన్నా రు. రేగుంటకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చే స్తానన్నారు. గ్రామంలో చిల్డ్రెన్స్ పార్క్, శ్మాశాన వాటిక పునరుద్ధరణ, బైపాస్, సీసీ రోడ్డు, మురికి కాలువలు నిర్మిస్తామన్నారు. అనంతరం ఎమ్మె ల్యేను గ్రామ కమిటీ, కుల సంఘల సభ్యులు స త్కరించారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాజీ మార్కెట్ చెర్మన్ బాల్క సు రేశ్ అధ్వర్యంలో సన్మానించారు. ఇక్కడ మున్సిపల్ అధ్యక్షురాలు ఉమారాణి, ఉపాధ్యక్షుడు లింబాద్రి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు షేక్ నవా బ్, మర్రి సహాదేవ్, చెర్లపెల్లి రాజేశ్వర్‌గౌడ్, రాజుమహ్మద్, రాయల్ నాయక్, గంగాధర్, రాజేశ్, నారాయణ, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles