అకాల వర్షం.. అపార నష్టం..


Sun,February 17, 2019 01:33 AM

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ/ జగిత్యాల టౌన్/మారుతినగర్/కోరుట్ల/ఇబ్రహీంపట్నం/పెగడపల్లి/ మల్యాల/మల్లాపూర్/మేడిపల్లి: జిల్లాలో శుక్రవా రం రాత్రి కురిసిన ఈదురు గాలులతో కూడిన రా ళ్ల వర్షానికి భారీ నష్టం సంభవించింది. మామిడి తో పాటు మక్క, ఆవాలు, జొన్న, పెసర, మిను ము పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడప ల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్, మేడిపల్లి, మల్యాల మండలాల్లో 33 శాతం పంట న ష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం అందుతుందని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి అమినబీ పేర్కొన్నారు.3027 ఎకరాల్లో ఆవ పంట, 4552 ఎకరాల్లో మక్క పంట, 172 ఎకరాల్లో జొన్న పంట, 57 ఎకరాల్లో మినుము పంట, 47 ఎకరాల్లో పెస ర పంటకు నష్టం వాటిల్లింది. బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షం కారణంగా చేతికందే దశలో ఉన్న మక్క, ఆవ, పెసర, మినుము, జొన్న పంటలతోపాటు పూత దశలో ఉన్న మామిడి తోటలు తీ వ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి పంట ప్రస్తుతం పూత , పిందె దశలో ఉండగా ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం పడడంతో మామిడి పిందెలు, ఎక్కువ మొత్తంలో పూత రాలిపోయింది. కొన్ని చోట్ల చెట్లు వేర్లతో నేలకొరగగా, కొమ్మలు విరిగి పాడ్డాయి.


ఇప్పుడిప్పుడే చేతికి వచ్చి అమ్మకానికి సిద్ధం చేస్తున్న పసుపునకు సైతం వర్షం తాకిడి తప్పలేదు. కోత దశలో ఉన్న ఆవ పంటపై రాళ్లు (వడగండ్లు), బలమైన ఈదురు గాలులతో ఒత్తిడి ఏర్పడి కర్రలు కిందికి ఒరిగి పోయి ఆవ గింజలు నేలరాలాయి. మక్కజొన్న కంకి దశలో బలమైన గాలికి తట్టుకోలేక కర్రలు విరిగి నేలకొరిగాయి. అ కాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటల వివరాలు, నష్టపోయిన రైతులకు సంబంధించి వివరాల సేకరణకు ప్రభుత్వం ఆదేశించడంతో శనివారం వ్యవసాయ శాఖ జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా అధికారితో పాటు మండల వ్యవసాయాధికారులు, విస్తీర్ణాధికారులు, సిబ్బంది గ్రా మాల్లో క్షేత్ర స్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. శనివారం సాయంత్రం క్షేత్ర స్థాయి లో పరిశీలన అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసిన పంట నష్టం ప్రాథమిక అంచనా వివరాల ప్రకా రం.. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఎనిమిది మం డలాల్లోని 6,718 మంది రైతులకు సంబంధించి 7855 ఎకరాల్లో ఆవ, మక్క, పెసర, మినుము, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీటిలో కోరుట్ల మండలంలో 193 ఎకరాల్లో ఆవ, 670 ఎకరాల్లో మక్క, మెట్‌పల్లి మండలంలో ఆవ 861 ఎకరాలు, మక్కజొన్న 830 ఎకరాలు, జొ న్న 45 ఎకరాలు, మి నుము 57 ఎకరాలు, పెసర 47 ఎకరాలు, మల్లాపూర్ మండలంలో ఆవ 494 ఎకరాలు, మక్కజొన్న 458 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో ఆవ 1479 ఎకరాలు, మక్క 1952 ఎకరాలు, జొన్న 127 ఎకరాలు, మేడిపల్లి మండలంలో మక్క 197 ఎకరాలు, రాయికల్ మండలంలో మక్క 430 ఎకరాలు, మల్యాల మండలంలో మక్క 15 ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.

మామిడి పంట మేడిపల్లిలో 479.20 హెక్టార్లలో, మల్యాల 520, రాయికల్ 560, కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లిలో 35.20, ధర్మపురి 20, వెల్గటూర్ 14, బుగ్గారం 8, గొల్లపల్లి 16, పెగడపల్లి 24 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. కాగా పంట నష్టం ఎక్కువగా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి మండలాల్లో ఎక్కువగా జరిగినట్లు అధికారుల పరిశీలన వెల్లడైంది. మెట్‌పల్లి మండలంలోని వేంపేట గ్రామ రైతులకు మండల వ్యవసాయాధికారి షా హీద్ ఆలీ నష్టపరిహారం ఎంత మేరకు జరిగిందే ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. మేడిపల్లి మండలంలోని కట్లకుంట, పోరుమల్ల, తొంబర్‌రావుపేట గ్రామాల్లో శుక్రవారం నష్టపోయిన పంటలను శనివారం ఎంఎల్‌హెచ్‌ఎస్‌ఓ అనిల్‌కుమార్ పరిశీలించారు. కోరుట్ల మం డలం మాదాపూర్ గ్రామశివారులోని మండల వ్యవసాయాధికారి నెలకొరిగిన పంటలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట, వర్షకొం డ, కోమటి కొండాపూర్, ఎర్దండి, మూలరాంపూ ర్, వేములకుర్తి, గోధూర్ సత్తక్కపల్లి, రాజేశ్వర్‌రావుపేట్, మేడిపల్లి తదితర గ్రా మాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న, ఆవ, జొన్న పంటలను శనివారం తహసీల్దార్ నారాయణ, మండల వ్యవసాయాధికారిణి దీపిక, విస్తరణాధికారులు పంటలను పరిశీలించారు.

ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వే సిన అధికారులు మొక్కజొన్న 1952, ఆవ 1479, జొన్న 127 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తెలిపారు. గాలి వాన బీభత్సంతో నెలకొరిగిన 105విద్యుత్ స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ పనులను విద్యుత్ అధికారులు చేపట్టారు. ఈమేరకు నష్టాన్ని అంచ నా వేసేందుకు మండలంలో పర్యటించిన ఏడీఈ శ్రీనివాస్ ధ్వం సమైన స్తంభాల వల్ల సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు శనివారం తెలిపారు. విరిగిన స్తంభాల స్థానంలో రెండు రోజుల్లో కొత్తవి ఏర్పా టు చేస్తామన్నారు. పెగడపల్లి మండలంలోని ఐతుపల్లి, నందగిరి, నామాపూర్, మ్యాకవెంకయ్యపల్లి, నర్సింహునిపేట, కీచులాటపల్లి, రాజరాంపల్లి గ్రామ రైతులకు వర్షం వల్ల ఎక్కువ నష్టం సంభవించింది.

భారీ ఈదురుగాలులతో మ్యాకవెంకయ్యపల్లి గ్రామానికి చెందిన ఆవాల లింగరెడ్డి, జీవన్‌రెడ్డి అనే రైతులకు చెందిన తోటలోని రెండు మామిడి చెట్లు కూకటి వేళ్లతో సహా కూలి పోవడంతో పాటు, అనే క చెట్లకు చెందిన కొమ్మలు విరిగి, మామిడి పూత, పిందెలు రాలిపోయాయి. వరి దెబ్బతింది. మండ ల వ్యవసాయ, ఉద్యావన శాఖ ఏఈఓలు అశోక్, యోగేశ్వర్, అనూష, అన్వేష్ పంట నష్టంపై పరిశీలన చేశారు. మండలంలో 150 ఎకరాల్లో మా మిడి, 180 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వారు పేర్కొన్నారు. మల్యాల మండల కేంద్రంలో స ర్పంచ్ మిట్టపెల్లి సుదర్శన్‌తో కలిసి తహసీల్దార్ శ్రీనివాస్ దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. మల్లాపూర్ మండలంలో నష్టపోయిన పంటల వివరాలను ఏఓ లావణ్య ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా ఏర్ప డి వివరాలను శనివారం సేకరించారు. సుమారు మండల వ్యాప్తం గా 425 ఎకరాల మక్క, 483 ఎకరాల ఆవాల పంటను రైతులు నష్టపోయారని, ముత్యంపేటలో అధిక పంట నష్టం జరిగినట్లు ఆమె తెలిపారు. అలాగే సుమారు ఏడు మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌ఓ కలీం చెప్పారు.

135

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles