చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి


Sun,February 17, 2019 01:32 AM

-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
-ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
కొడిమ్యాల : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని నమిలకొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ విలాసాగరం అజయ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన స్మారకార్థం గ్రామానికి చెందిన మిత్రులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే భవిష్యత్‌లో ఉద్యోగావకాశాల్లో గుర్తింపు ఉంటుందన్నారు. అంతకు ముందు వివిధ మండలాల నుంచి వచ్చి న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాం తి, వైస్ ఎంపీపీ బల్కం మల్లేశం, ఎంఈఓ నారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మల్యాల అనిత, ఎంపీటీసీ సభ్యులు విక్కుర్తి నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచులు పునుగోటి కృష్ణారావు, సయ్యద్ హైదర్, ప్రధానోపాధ్యాయులు పద్మజ, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగరావు, మల్యాల లింగయ్య, వేముల శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles