3,500 జనాభాకో ఎంపీటీసీ!


Fri,February 15, 2019 12:18 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) వచ్చే జూలై 4, 5 తేదీలతో ప్రస్తుతం ఉన్న జ డ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాల పునర్విభజనలో భా గంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా 14 మండలాలు ఏర్పాటయ్యాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంట.. జగిత్యాల జిల్లాలో జగిత్యాల రూరల్, బీర్‌పూర్, బుగ్గారం.. పెద్దపల్లి జి ల్లాలో అంతర్గాం, పాలకుర్తి, రామగిరి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి, వేములవాడ రూ రల్, రుద్రంగి, వీర్నపల్లి అవతరించాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కొత్త జిల్లాల్లో మొత్తం 60 మండలాలున్నాయి. నిజానికి పాత ఉమ్మడి జిల్లా ప్రకారం 57 మండలాలుండేవి. అప్పుడు 57 జడ్పీటీసీలు, 57 ఎంపీపీలు ఉం డగా, 817 ఎంపీటీసీ స్థానాలుండేవి. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన క్రమంలో ఎంపీటీసీ స్థానాలను పు నర్విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ మేరకు మార్గదర్శకాలను జిలా ్లయంత్రాగానికి బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ పంపించింది. వచ్చిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే.. ప్రతి మండలంలోని మొత్తం జనాభాను పరిగణలోకి తీసుకొని అందులో 3,500ల జనాభాకు ఒకటి చొప్పున మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఏర్పాటు చేయాలని సూ చించింది. వీటిని ఏర్పాటు చేసే సమయంలో ప్ర ధానంగా పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. ముఖ్యంగా జియోగ్రాఫికల్‌గా, డెవలప్‌మెంట్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా వయోబుల్ ఉండే విధంగా ఎంపీటీసీ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. అంతేకా దు, కొన్ని సందర్భాల్లో 3,500ల జనాభాకు కొం చెం అటు ఇటు అయినా.. స్థానిక పరిస్థితులు, ఇ తర అంశాలను పరిగణలోకి తీసుకొని హెచ్చుతగ్గులు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 1995 నుంచి ఎంపీటీసీల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆనాడు ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేసేందుకు 1991 జనాభా లెక్కలను ప్రామాణికం చేసుకున్నారు. తాజా ఆదేశాల ప్రకారం చూస్తే.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎంపీటీసీస్థానాల విభజన జరగనున్నది.


మారనున్న స్వరూపం..
ప్రస్తుతం మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గం(ఎంపీటీసీ) పరిధి చాలా మేరకు మారే అవకాశం ఉంది. 1991 జనాభా ఆధారంగా ఏ ర్పాటు చేయగా, అప్పటికీ ఇప్పటికీ జనాభా చా లా పెరిగింది. అంతేకాదు, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వివిధ మండలాల్లో ఉన్న గ్రామాలను కొత్త మండలాల్లోకి కలుపుతూ, ఉమ్మడి జిల్లాలో కొత్తగా 14 మండలాల ఏర్పాటు జరిగిం ది. దీంతో పలు మండలాల స్వరూపం ఇప్పటికే మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలు కూడా వేర్వే రు మండలాలకు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో మండల జనాభా ఆధారంగా ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేయాలన్న ఆదేశాల వచ్చాయి. ఈ దిశగా యంత్రాంగం అడుగులు వేస్తున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న చాలా మండల పరిషత్ ప్రాంతీ య నియోజకవర్గాల స్వరూపం మారే అవకాశం ఉన్నది. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే.. కొత్తగా ఏర్పడిన 14 మండలాల పరిధిలో 116 మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. జి ల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కొత్తగా మూడు జిల్లా పరిషత్తులు ఏర్పడనున్నాయి. ఇదే సమయంలో 14 కొత్త మండలాల్లో 14 జడ్పీటీసీలు, అదే స్థాయిలో ఎంపీపీలు ఏర్పడున్నాయి.

కసరత్తు చేస్తున్న అధికారులు..
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జారీచేసిన మార్గదర్శకాలపై జిల్లా పరిషత్ అధికారులకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియనంతా 25లోగా పూర్తిచేసి ప్రతిపాదనలు పం పాల్సి ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కసరత్తు చేయాలని ఆదేశించారు. దీంతో జడ్పీ అధికారులు రం గంలోకి దిగారు. ఆ మేరకు ఆయా మండల ఎంపీడీవోల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తు తం మండల వారీగా ఉన్న ఎంపీటీసీ స్థానాల వివరాలతోపాటు, కొత్త మండల ఏర్పాటు నేపథ్యంలో మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గంలో జరిగిన మార్పులు చేర్పుల వంటి అంశాలపై సమాచారం తీసుకుంటున్నారు. అంతేకాదు.. ప్రతి 3,500ల జనాభాకు ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తే.. ఆయా ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఏయే గ్రామాలను కలుపాలో కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని ఎంపీడీవోలకు సూచించారు. అయితే కొన్ని మండలాలు పట్టణాల్లో కలిసిన నేపథ్యంలో వీటిపై కొంత స్పష్టత రావాల్సిన అవసరముందని అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రక్రియనంతా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతుండగా..పునర్విభజనలో ఎంపీటీసీ స్థానాల రూపురేఖలు ఎలా మారుతాయో అన్న ఉత్కంఠ అదరిలో నెలకొంది.

128

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles