హ్యాట్రిక్ కోసం కసరత్తు


Fri,February 15, 2019 12:17 AM

(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/జగిత్యాల టౌన్) ఏమండీ.. మ్యాథ్స్ సార్‌గారు..పదో తరగతిలో ఎంత మంది విద్యార్థులున్నారు..? వారి అటెండె న్స్ పరిస్థితి ఏంటీ? ఎలా చదువుతున్నారు? పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారా? పది జీపీఏ వచ్చేవారు ఎందరు? 9.5 జీపీఏ వచ్చేవారి సంఖ్య ఎంత? ఏ విద్యార్థి ఉత్తీర్ణతపై అనుమానం ఉంది? అతడిని పాస్ చేయించేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటీ? చదవులో వెనకబడిన విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారా? ఎందుకు వెనకబడ్డాడో కారణం గుర్తించారా? ఎలా సన్న ద్ధం చేస్తారు? అలాంటి వాళ్లను కూడా పాస్ చే యించే బాధ్యత మీదే ఇవి ఎవరో ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడితో మాట్లాడిన మాట లు కావు. జిల్లా విద్యాధికారి సమీక్షా కాదు. ఉపాధ్యాయుడితో సాక్షాత్తూ కలెక్టర్ జరిపిన సంభాషణ ఇది. ఏదో పాఠశాలకు కలెక్టర్ వెళ్లిన సందర్భంలో ఉపాధ్యాయుడితో మాట్లాడిన మాటలు అసలే కావు. జిల్లాలోని పదో తరగతికి బోధించే ప్రతి ఉపాధ్యాయుడితో కలెక్టర్ మాటలు ఇవి. జి ల్లా వ్యాప్తంగా ఉన్న 165 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి పదో తరగతి చదవుతున్న ప్రతి విద్యార్థి సామర్థ్యం, సన్నద్ధదతపై సమీక్ష నిర్వహించారు. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో వరుసగా మూడోసారి కూడా అగ్రస్థానం సాధించాల్సి న ఆవశ్యకతను ఉపాధ్యాయులకు తెలియజేశారు.


రెండుసార్లు మొదటి స్థానం
జిల్లాలో మొత్తం 321 పాఠశాలల్లో పదో తరగతి బోధన జరుగుతున్నది. ఈ పాఠశాలల నుంచి 13,359 మంది విద్యార్థులు వచ్చే నెల 16 నుం చి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 8,713 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా, 4,646 మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు. గడిచిన రెండు విద్యా సంవత్సరాల నుంచి జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రికార్డు స్థాయి విజయాన్ని కైవసం చేసుకుంది. 2015-16 విద్యా సంవత్సరంలో జగిత్యాల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు 85 శాతం మందే విజయం సాధించారు. 2016-17 విద్యా సంవత్సరం వరకు జగిత్యాల జిల్లాగా మారింది. 2016 అక్టోబర్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శరత్, విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సుంకేశుల వెంకటేశ్వర్లు పదో తరగతి విద్యార్థులకు బోధన, ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడడం మొదలైంది. ఆ విద్యా సంవత్సరం జరిగిన పది పరీక్షల్లో జిల్లా రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. ఏకంగా 97.35 శాతం ఉత్తీర్ణత సాధించి, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లాంటి పెద్ద జిల్లాలనూ అధిగమించింది. 2017-18లోనూ కలెక్టర్, డీఈవో కృషి ఫలితంగా అంతకు ముందు సంవత్సర ఫలితాలను తిరగరాసింది. 13,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 13,418 మంది ఉత్తీర్ణత సాధించారు. కేవలం 202 మందే పాస్ కాలేకపోయారు. 97.56 శాతం ఫలితాలతో మరోసారి రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానం కైవసం చేసుకున్నది.

అరవై రోజుల ప్రణాళికతో ముందుకు
ఫలితాల్లో వరుసగా మూడో సారి అగ్రస్థానం సాధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండుసార్లు కలిసి వచ్చిన ఉత్తేజం కార్యక్రమాన్ని మరోసారి అమలు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాల కోసం 60రోజుల ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. నవంబర్ 15 నుంచి ఫిబ్రవరి 7వరకు దీన్ని అమలు చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 దాకా, సాయంత్రం 4.45 నుంచి 5.45దాకా తరగతులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తరగతులకు ఒకే టైమ్‌టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం, సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులను అందుబాటులో ఉం చారు. తరగతుల సమయంలో విద్యార్థులకు అ ల్పాహారం అందజేస్తూ వచ్చారు. కలెక్టర్ శరత్ తన నిధుల నుంచి ఉత్తేజం కోసం ప్రత్యేకంగా మంజూరు చేశారు. దాతలు సైతం విరాళాలు ఇ చ్చారు. అల్పాహారం ఒకే మాదిరి ఇవ్వకుం డా, రోజురోజుకూ మార్చారు. ఇందుకోసం ప్ర త్యేక టైంటేబుల్ ఏర్పాటు చేశారు. సోమవారం అటుకులు, తర్వాత ఉప్మా, బిస్కెట్లు, సమోసా, అరటి పండ్లు, బోల్‌ప్యాలాలతో చుడువా లాంటి వి వా రంలో అందించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక సమయాల్లో విద్యార్థులకు బోధనతో పాటు, లెక్క లు, ఆంగ్లం, సైన్స్‌పై ప్రత్యేక చిట్కాలు బోధిస్తూ వచ్చారు. కలెక్టర్ కూడా ఉపాధ్యాయులతో సమీ క్షా సమావేశాలు నిర్వహించారు. పది ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు మినహా ఇతర బాధ్యతలు ఏవీ అప్పగించకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అరవై రోజుల ప్రణాళిక ముగిసిన నేపథ్యంలో మరో 34 రోజుల సమయం మిగిలి ఉంది. ఈ సమయం కూడా విద్యార్థులకు మరిన్ని మెళకువలను నేర్పిస్తున్నారు.

72

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles