కరీంనగరాన భారీ జెండా


Fri,February 15, 2019 12:17 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ నడ్డిబొడ్డున రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతీయ జెండా శుక్రవారం రెపరెపలాడనున్నది. ఈ జెం డాను కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ శుక్రవారం ఉదయం ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో అతి ఎత్తయిన జాతీయ జెండాను ఏర్పాటు చేశా రు. దానిని స్ఫూర్తిగా తీసుకున్న నగర మేయర్ రవీందర్‌సింగ్, నగరంలోనూ అతి ఎత్తయిన జా తీయ జెండాను ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా నగరం నడ్డిబోడ్డులోని మల్టిపర్పస్ స్కూల్ మైదానంలో 150 ఫీట్ల (291 అడుగులు) ఎత్తున జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముం దు నుంచే అన్ని పనులు చేపట్టారు. అయితే ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో జాతీయ జెండాను ఆవిష్కరించలేకపోయారు. ప్రస్తుతం ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. పూణే సమీపంలోని రంజన్‌గావ్‌లో జెండాను తయారు చేయించారు. నేటి ఉదయం ఎంపీ వినోద్‌కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.


ప్రత్యేక చొరవ..
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఇప్పటికే వంద ఫీట్లకు మించి ఎత్తైన జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కరీంనగర్ స్మార్ట్‌సిటీగా ఎంపికైన అనంతరం గతేడాది ఆరంభంలోనే నగరంలో 150 ఫీ ట్ల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని మేయ ర్ నిర్ణయించారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆరు నెలల క్రితం ఈ జెండా ఏర్పాటుకు నగరపాలక సంస్థ నుంచి టెండర్లను పిలిచారు. దీనిలో బజాజ్ కంపెనీకి చెందిన సంస్థ టెండర్‌లో పాల్గొని పనులను దక్కించుకుంది. సుమారు 60 లక్షల వ్యయంతో దీనిని ఏర్పాటు చేస్తుండ గా, రెండేళ్ల పాటు దీని నిర్వహణ బాధ్యతలు కూ డా ఆ సంస్థనే చేపట్టనుంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, గాలి ఒత్తిడిని తట్టుకుని నెలబడేలా దీనిని సిద్ధం చేశారు. గత అక్టోబర్‌లో ఈ జెండాకు సంబంధించి పనులన్నింటని వేగంగా పూర్తి చేయించేందుకు మేయర్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అయితే మధ్యలోనే ఎన్నికల కోడ్ రావడం, ప్రతిపక్షాలు దీనిని అడ్డుకోవడంతో ఆవిష్కరించలేకపోయామని మేయర్ పేర్కొన్నారు.

నేడు ఆవిష్కరణ..
జాతీయ జెండాను శుక్రవారం అట్టహాసంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగు ల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, బల్దియా కమిషనర్ సత్యనారాయణతోపాటు వివిధ విభాగాల అధికారులు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

81

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles