కర్ర పారిశ్రామికుల నిరసన ర్యాలీ


Thu,February 14, 2019 12:20 AM

జగిత్యాల టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం కర్ర పరిశ్రమలపై విధించిన ఆంక్షలను నిరసిస్తూ జిల్లా విశ్వబ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సం ఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌ఓ అరుణశ్రీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కర్ర పారిశ్రామిక సంఘం నాయకులు మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన ప్రతి వృత్తి ఆధారిత విశ్వబ్రాహ్మణుడికి విశ్రాంత పెన్షన్ ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణిం చిన ప్రతి విశ్వబ్రాహ్మణుడికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెల్లిం చి, ప్రతి దుకాణానికి విద్యుత్ సరఫరా అనుమతిని ఫోర్త్ కేటగిరి కల్పించాలన్నారు. ప్రభుత్వ కలప డిపోలో వేలం పాటలో 50 శాతం రాయితీ కల్పించి, కలప వృత్తిపై ఆధారపడిన ప్రతి విశ్వబ్రాహ్మణుడికి వ్యక్తిగత పూచీ కత్తుపై రూ. 3 లక్షల వరకు బ్యాంక్ రుణం ఇచ్చి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీవీ సత్యం, ప్రధాన కార్యదర్శి సంకోజి రమణ, బా ల్యాల గంగారాం, చంద్రమౌళి, వేములవాడ భాస్కరాచారి, ధర్మ పురి అశోక్, పూడూర్ లక్ష్మీనారాయణ, సంకోడా నర్సయ్యతో పాటు 300 మంది విశ్వబ్రాహ్మణులు ర్యాలీలో పాల్గొన్నారు.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles