ధర్మపురిలో నేటి నుంచి మహాయాగం


Thu,February 14, 2019 12:19 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ:హైదరాబాద్ రామానుజ యాజ్ఙిక పీఠాధిపతుల ఆధ్వర్యంలో విశ్వశాంతి సమైక్యత సమృద్ధి సుభిక్షం కోసం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గురువారం నుంచి ఆదివారం వరకు శ్రీశ్రీశ్రీ సుదర్శన సహిత లక్ష్మీనరసింహస్వామి త్రయాహ్నిక, ఏకకుండాత్మిక యాగం నిర్వహించనున్నట్లు రామానుజ యాజ్ఙిక పీఠం ప్రతినిధులు తెలిపారు. త్రిదండి రామన్నారాయణ రామానుజ చిన్న జియర్‌స్వామి, త్రిదండి అహోబిల జియర్‌స్వామి, త్రిదండి దేవనాథ జియర్‌స్వామి గార్ల మంగళశాసనములతో రామచంద్ర రామానుజ జియర్‌స్వామి, జగద్గురు పుష్పగిరి శంకరాచార్యుల వారి పర్యవేక్షణలో ఈ మహాయాగం నిర్వహించను న్నట్లు వారు వివరించారు. ఈ మేరకు బుధవా రం ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం సా యంత్రం ఆరు గంటలకు శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్ర మ్, శ్రీవిష్వక్సేన పూజ, స్వస్తి వాసుదేవ, పుణ్యహావచనము, అంకురార్పణం నిర్వహించనున్నట్లు తెలిపా రు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పాలాభిషేకం, వేదపారాయణం, శ్రీచక్రపెరుమాండ్లకు నవకలశ స్నపనము, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ, దేవతాహ్వానము, తీర్థప్రసాదగోష్టి, అన్నప్రసాదం, సాయంత్రం ఆరు గంటలకు పంచసూక్త హోమము, శ్రీవిష్ణుసహస్రపారాయణం పూజాకార్యాక్రమాలు నిర్వహించబడతాయని, శనివారం ఉదయం ఐదు గంటలకు యోగానరసింహస్వామివారికి పాలాభిషేకం, దివ్యప్రభంధ సేవాకాలం, మహాలక్ష్మీ హోమం, ఆదివారం ఉద యం ఐదు గంటలకు ఉగ్రనరసింహస్వామి అభిషేకం, వేదపారాయణం, సేవాకాలుము, శ్రీసుదర్శన నరసింహయాగము, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles