పేదలకు అండగా కల్యాణ లక్ష్మి


Thu,February 14, 2019 12:19 AM

- ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
-100 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
వెల్గటూరు: పేద కుటుంబంలో ఉన్న ఆడ బిడ్డ వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని ధర్మపురి ఎమ్మె ల్యే కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వెల్గటూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బుధవారం మండలానికి చెందిన 100 మంది కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన రూ.89,88,368 విలు వైన చెక్కులను ఎంపీపీ శ్రీనివాసరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బం ది ఎమ్మెల్యే, ఎంపీపీని ఘనంగా సన్మానించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ ఆడ బిడ్డ వివాహ సమయంలో పేద కుటుంబానికి పెద్దన్నగా వ్యవహరిస్తు ఆర్థికంగా ఆదుకోవడంకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకాలను భారతదేశంలో ఉన్న కొన్ని ఇతర రాష్ర్టాలు అమలు చే సేందుకో సం ప్రయత్నిస్తున్నాయన్నారు. రైతు బీమా పథ కం ద్వారా మృతి చెందిన రైతు కుటుంబానికి వా రం లోపు రూ.5 లక్షల నగదును ప్రభు త్వం అం దజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలను బలోపేతం చేసిందన్నా రు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని అభివృద్ధి చేసిందన్నారు.


గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు, మత్స్యకారులకు చేప విత్తనా లు, వాహనాలను అందజేసిందని గుర్తు చేశారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అ హర్నిషలు కృషి చేశానని అన్నారు. వెల్గటూరు లి ఫ్ట్ కోసం రూ.30 కోట్లు, స్తంభంపల్లి లిఫ్ట్‌కోసం రూ.31 కోట్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. వెల్గటూరులో మార్కెట్ యార్డు, కుమ్మరిపల్లిలో ఆదర్శ పాఠశాల, కేజీబీవీ నిర్మాణాలకు కోట్లల్లో నిధులను మంజూరు చేయించాన ని తెలిపారు. స్తంభంపల్లికి బీసి గురుకుల పాఠశాల మం జూరు చేయించానని పేర్కొన్నారు. వెల్గటూరు నుంచి కోటిలింగాల వరకు డబుల్ రోడ్డు నిర్మా ణం, గోదావరిలో బోటింగ్, ఆలయ అభివృద్ధి పనులు చేయించానని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చేతి పంపులు, తాగునీటి బావులతో పాటు మ రెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. ఇంత అభివృద్ధి చేసినా మండల ప్రజలు తనకు మెజార్టీని అందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కల్యాణ లక్ష్మి చె క్కులను పొందినవారు ప్రభుత్వం అందజేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకోలని కోరారు. ఇక్కడ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, సర్పం చ్ మేరుగు మురళీగౌడ్, ఎంపీటీసీ పత్తిపాక వెంకటేశ్, కేడీసీసీబీ డైరెక్టర్ పొనుగోటి రాంమోహన్‌రావు, తహసీల్దార్ ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

పరిహారం చెక్కు అందజేత
పైడిపెల్లి గ్రామానికి చెందిన తరాళ్ల నారాయణ పిడుగు పాటుతో మృతి చెందగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.6 లక్షల పరిహారం చె క్కును ధర్మపురి ఎ మ్మెల్యే కొప్పుల ఈ శ్వర్ బుధవారం ఆ యన భార్య లక్ష్మికి అం దజేశారు. ఇక్క డ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గం గుల అశోక్, ఆర్డీఓ నరేందర్, నాయకులు గంగుల నగేశ్ తదితరులున్నారు.

79

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles