వెటర్నరీ కళాశాల అధ్యాపకుల

Thu,February 14, 2019 12:18 AM

-సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
-కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
కోరుట్లటౌన్: వెటర్నరీ కళాశాల అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణ శివారు పీవీ నరసింహరావు కళాశాల అధ్యాపకులు బుధవారం ఎమ్మెల్యేను సత్కరించి అభినందనలు తె లిపారు. అనంతరం నిరసనలో భాగంగా తా ము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వి వరించారు. కోరుట్ల వెటర్నరీ కళాశాలపై ఉన్నతాధికారులు సవత తల్లి ప్రేమ చూపుతున్నారని, నిధులు, వసతుల రూపకల్పన, నియామకాల్లో మెండి చెయ్యి చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని కోరుట్లకు తరలించడంతో పాటూ శాశ్వత అధికారులను నియమించాలని, బోధన సిబ్బంది, అ ధ్యాపకుల బదిలీలు, సీఏఎస్ ప్రమోషన్ల ప్రకటించేలా చొరవ తీసుకోవాలని వారు విన్నవించారు. సమస్యలను ఎంపీ కవిత, వీసీ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే వా రికి భరోసా కల్పించారు. ఇక్కడ టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, అధ్యాపక సంఘం అధ్యక్షుడు డాక్టర్ రామచంద్రం, కార్యదర్శి డాక్టర్ రామ్‌సింగ్, అధ్యాపకులు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles