ఆడబిడ్డలకు వరంలా కల్యాణలక్ష్మి

Wed,February 13, 2019 12:56 AM

-పేద తల్లిదండ్రులకు భరోసా
-ఈ పథకంలోనూ దేశానికి తెలంగాణ ఆదర్శం
-ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
-పెగడపల్లి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల్లో 130మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
-విలువ రూ.1.20కోట్లు
పెగడపల్లి/ బుగ్గారం / గొల్లపల్లి : కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలకు ఆడబిడ్డలకు వరంలా నిలిచాయనీ, పేద తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నాయని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పునరుద్ఘాటించారు. పెగడపల్లి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల్లో 130మంది లబ్ధిదారులకు రూ.1.20కోట్ల విలువ జేసే చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సం క్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 55మందికి రూ.56 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. మన రైతుబంధు పథకాన్ని ఇటీవల కేంద్రం కూడా ప్రకటించిందనీ, కల్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేసేందుకు పలు రాష్ర్టాలు సన్నాహా లు చేస్తున్నాయని చెప్పారు.

ఎన్నికల హామీలో లేకున్నా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారనీ, మూడున్నరేళ్లుగా పేదలు, బడుగులకు చెందిన ఆడబిడ్డలకు వివా హ సమయంలో ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందనీ, ముందుగా కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం ఉండగా, బీసీలు, ఉన్నత వర్గాలు, ముస్లింలలోనూ పేదలున్నారని గుర్తించి వారికి కూడా అమలు చేయడం అభినందనీయమన్నారు. పెగడపల్లిలో ఎంపీపీ కాశెట్టి సత్తయ్య, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, గిర్దవార్ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ కరుణాకర్‌రావు, విండో చైర్మ న్ ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, సర్పంచులు మేర్గు శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, కరుణాకర్‌రెడ్డి, బాబుస్వామి, లక్ష్మణ్, రాకే శ్, కొండయ్య, సులోచన, హారిక, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, నాయకులు ఇనుకొండ మోహన్‌రెడ్డి, గోలి సురేందర్‌రెడ్డి, జానీపాషా, చందు, నర్సింహరెడ్డి, మంత్రి వేణు, బండి వెంకన్న, ఇరుగురాల ఆనందం, గాజుల గంగాధర్, రాంచంద్రం, మడిగెల తిరుపతి, పెద్ది రమేశ్, చంద్రారెడ్డి, ఐలేని సాగర్‌రావు, కనకయ్య, విఆర్వోలు రమేశ్, అనంతరావు, బషీర్, బాబుమియ, పోచమల్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

బుగ్గారంలో 45మందికి..
బుగ్గారం తహసీల్దార్ కార్యలయంలో 45మంది రూ.41,05,220 విలువగ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఈశ్వర్ పంపిణీ చేశారు. తనను బుగ్గారం ప్రజ లు ఆదరించి గెలిపించారని గుర్తు చేశారు. ధర్మపురి నియోజకవర్గంగా మారినాక బుగ్గారాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదనీ, అందుకే వ్యయప్రయాసలకు ఓర్చి బుగ్గారాన్ని మండల కేంద్రంగా చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్నమాట నిలుపుకొన్నానని తెలిపారు. రవాణా సౌకర్యా లు, మౌలిక వసతుల కోసం నిరంతరం కష్టపడుతూనే ఉ న్నానని తెలిపారు. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మం డల ఓటర్లు తనను కాస్త నిరుత్సాహ పరిచారనీ, తక్కువ మెజార్టీతో గెలిపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశా రు.

ట్రక్కుగుర్తుతో ఓటర్లు అయోమయమైనా, క్రాస్ ఓటిం గ్ జరిగినా, కష్టపడేవారకే లక్ష్మీనరసింహుడు విజయం చేకూర్చాడన్నారు. టీఆర్‌ఎస్‌ది చేతల ప్రభుత్వమనీ, మం డలంలో 95 మందికి మినహా పట్టాదారు పాస్‌బుక్‌లు పం పిణీ చేశామని చెప్పారు. 75శాతం సీసీరోడ్లు వేశామన్నారు. శివారులోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ సర్పంచ్ మూల సుమలత, విండో చైర్మన్ బాదినేని రాజేందర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జోగినపెల్లి సుచేందర్, రైతు సమితి మండలాధ్యక్షుడు సత్యనారాయణ రావు, బీసీ సెల్ మండలాధ్యక్షుడు మూల శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సీపెల్లి పోశమల్లు, ముస్లిం కమిటీ అధ్యక్షుడు రహమాన్, సర్పంచ్‌లు దోరగాండ్ల జగన్, కోల రాజు, కారుకూరి లక్ష్మి, చెనమల్ల దివ్య,నాయకులు చుక్క శ్రీనివాస్, పొన్నం సత్తయ్య, పొన్నం శంకర్, గాండ్ల జగన్, సంగవేణి సంజీవ్, జంగ శ్రీనివాస్, గాలిపెల్లి మహేశ్, సులిగె మహేశ్ పాల్గొన్నారు.

గొల్లపల్లిలో 30మందికి..
గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని 30మంది లబ్ధిదారులకు రూ.28,28,480 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఏడుగురికి రూ. 75,115కాగా, 23 మందికి రూ.1,00,116 చొప్పున అం దించారు. నందిపల్లిలో వరదల్లో 19 గేదెలు మృత్యువాత పడగా సదరు రైతుకు ఒక్కో బర్రెకు రూ. 30వేల చొప్పున దూడకు రూ.16వేల చొప్పున రూ. 5,56,000 విలువైన పరిహారం చెక్కులు అందించారు. తహసీల్దార్ లకా్ష్మరెడ్డి, ఏడీ కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు హన్మాం డ్లు, జలంధర్, కిష్టారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles