యాష్కీపై కన్నెర్ర..

Wed,February 13, 2019 12:54 AM

మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అవినీతిపరుడనీ, ఆయనను తక్షణమే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయ కులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేం ద్రం, కోరుట్ల పట్టణంలో ప్లకార్డులతో ప్రదర్శన ఇవ్వగా ఇబ్రహీపట్నంలో యాష్కీ బొమ్మను దహ నం చేశారు. మల్లాపూర్‌లో ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు.
జగిత్యాల, నమస్తే తెలంగాణ : అవినీతిపరుడైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను తక్షణమే కాం గ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుట్ల ని యోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం యాష్కీని పార్టీ నుం చి సస్పెండ్ చేయాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మా ట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో కూడా ప్రచారానికి రాకుం డా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోవడానికి కారణమయ్యాడన్నారు. యాష్కీ ప్రవర్తన సరిగా లేదనీ, గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు తిరిగాడా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయో పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా మధుయాష్కీకి టికెట్ ఇవ్వవద్దని, మధుయాష్కీ వెంటనే కాంగ్రెస్ పార్టీకి, కాం గ్రెస్ శ్రేణులకు బేషరుతుగా క్షమాపణ చెప్పి ఏఐసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. కోరుట్ల పట్టణాధ్యక్షుడు చెరుకు సమ్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ ఖరీ, ఎండీ రజాక్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల అధ్యక్షుడు రాజేందర్ యాదవ్, సాయి కుమార్, శ్రీనివాస్, వినోద్, అరవింద్, తదితరులున్నారు.

మధుయాష్కీగౌడ్‌కు కాంగ్రెస్‌లో కొనసాగే నైతిక హక్కు లేదు
కోరుట్లటౌన్ : అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి కారణమైన మాజీ ఎం పీ మధుయాష్కీకి పార్టీలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆరోపిస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు మం గళవారం నిరసన చేపట్టారు. ఈమేరకు స్థానిక కొత్త బస్టాండు వద్ద జాతీయ రహదారిపై కరపత్రాలను ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. ఇక్కడ కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖలీం, మం డల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రజా క్, ఇబ్రహీంపట్నం మండలాధ్యక్షుడు రెబ్బటి రా జేందర్ యాదవ్, మల్లాపూర్ మండలాధ్యక్షుడు సాయికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలివేరి శ్రీనివాస్, మల్లాపూర్ యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వినోద్, ఎన్‌ఎస్‌యూఐ ఇబ్రహీంపట్నం మండ లాధ్యక్షుడు ఆరవింద్ తదితరులున్నారు.
మధుయాష్కీ దిష్టిబొమ్మ దహనం
ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలో మంగళవారం మాజీ ఎంపీ మధుయాష్కీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రెబ్బటి రాజేందర్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ మండలాధ్యక్షుడు అరవింద్, నాయకులు ఉన్నారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి..
మల్లాపూర్: ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీని కాంగ్రెస్ పార్టీ నుం చి వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు వర్గీయులు మంగళవారం మండల కేంద్రంలో ఒంటి కాలుపై నిల్చో ని నిరసన వ్యక్తం చేశారు. నాయకులు కుందారపు సాయికుమార్, బీ హన్మాండ్లు, చిలివేరి శ్రీనివాస్, వినోద్, ఎండీ రజాక్, తదితరులున్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles