తొలి విడత ‘పంచాయతీ’ ప్రశాంతం

Tue,January 22, 2019 02:09 AM

-ముగిసిన మొదటి విడత జీపీ ఎన్నికలు
-సారంగాపూర్ మండలంలోని 15 గ్రామాల్లో 82.42, బీర్ మండలంలోని 14 గ్రామాల్లో 82.93 శాతం పోలింగ్
-రాయికల్ 81 శాతం పోలింగ్
సారంగాపూర్ : మొదటి విడత ఎన్నికల్లో భాగంగా సా రంగాపూర్, బీర్ మండలాల్లో జరిగిన ఎన్నికలు సో మవారం ప్రశాంతంగా జరిగాయి. సారంగాపూర్ మం డలంలోని 15గ్రామాల్లో 83.42శాతం, బీర్ మండలంలోని 14గ్రామాల్లో 82.93శాతం పోలింగ్ నమోదైనట్లు ఎంపీడీవో పుల్లయ్య పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో 80.82శాతం, నాగునూర్ 86.20శాతం, నాయకపుగూడెంలో 60.70శాతం, పెంబట్లలో 82.56శాతం, బట్టపెల్లిలో 87.16శాతం, లచ్చక్కపేటలో 83.58శాతం, ధర్మానాయక్ 85.76 శాతం, సారంగాపూర్ 81.99శాతం, అర్పపల్లిలో 78.72 శాతం, పోతారంలో 78.20శాతం, రంగపేటలో 83.47శాతం, రేచపల్లిలో 94.24శాతం, లచ్చానాయక్ 81.53శాతం, కోనాపూర్ 79.48 శాతం, పోచంపేటలో 83.07శాతం పోలింగ్ నమోదైంది. బీర్ ర్ మండలంలోని తుంగూరులో 83.55శాతం, చిన్నకొల్వాయిలో 87.96శాతం, మంగెళలో 84.95 శాతం. చెర్లపెల్లిలో 86.93శాతం, నర్సింహులపల్లిలో 83. 44 శాతం, కమ్మునూర్ 87.87శాతం, చిత్రవేణిగూడెంలో 91.27 శాతం, రేకులపల్లిలో 84.08శాతం, కండ్లపెల్లిలో 86.97 శాతం, రంగసాగర్ 75శాతం, తాళ్లధర్మారంలో 86.07 శాతం, బీర్ 81.16శాతం, కోమన్ 81.27 శాతం, కొల్వాయిలో 77.29శాతం పో లింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. సారంగాపూర్, బీర్ మండలాల్లోని ఆ యా పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శరత్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ ఎస్పీ మురళీధర్, ఆర్డీవో జీ నరేందర్, మండల ప్రత్యేక అధికారులు నర్సింహరావు, అశోక్ రాజ్, ఎంఈవో కాంతయ్య, ఏవోలు తిరుపతి నాయక్, రమ్య, ఏఈలు విద్య, రాజమల్లయ్య, సూపరింటెండెంట్ వేణుమాధవ్, శ్రీకోటి శ్రీనివాస్, జగిత్యాల రూరల్ సీఐ రాజేష్, ఎస్ శీలం రాజయ్య, శంకర్ నాయక్, ఎస్ అధికారులు ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రాయికల్ : రాయికల్ మండంలో సోమవారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాయికల్ మండల వ్యాప్తంగా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేయడంతో పో లింగ్ శాతం గంతో కంటే ఎక్కువగా పెరిగింది. రాయికల్ మండలం వ్యాప్తంగా సోమవారం 30 గ్రామాల్లో న్నికలు జరుగగా 81శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని 30 గ్రామాల్లో 35419 ఓటర్లు ఉండగా 28727 ఓట్లు పో లయ్యాయి. పురుషులు 16,894 ఓటర్లు ఉండగా 12, 017 ఓట్లు, మహిళలు 18520 ఓటర్లు ఉండగా 16,726 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా భూపతిపూర్ 90 శాతం, అత్యల్పంగా ధర్మాజీపేట్ 60 శాతం పోలింగ్ నమోదైంది. కొత్త ఓటు వచ్చిన యువతీ, యువకులు ఉత్సాహంగా కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అబ్జర్వేషన్ అధికారి , జేసీ రాజేశం ఎన్నికల కేంద్రాలను పరిశీలించి పలు సూచనలను చేశారు.

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles