రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శం


Tue,January 22, 2019 02:08 AM

-రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్
- జిల్లా కేంద్రంలో గోదాం నిర్మాణాల పరిశీలన
జగిత్యాల టౌన్:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలస్తున్నాయనీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న గోదాములను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో చైర్మన్ సామేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దేశానికి చాటి చెప్పిన ఘన త ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 4 వేల చొప్పున సంవత్సరానికి రూ. 8 వేలు ఇవ్వడంతో పాటు రైతు బీమా పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నదన్నారు. రైతు బంధు పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమలు చేస్తాననడం తెలంగాణకే గర్వకారణమన్నారు. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను నిర్ణయించే బాధ్యతలను ప్రభుత్వం రైతులకు అప్పగించే వి ధంగా కార్యాచరణ రూపొందిస్తున్నదన్నారు. వృ థాగా పోతున్న 70 లక్షల టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా ఎస్సారెస్పీలోకి పంపించేందుకు కాళేశ్వరంలో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని జూన్ వరకు ప్రాజెక్టు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ పంటకు నీటిని అందించేందుకు నిర్మాణా న్ని వేగవంతం చేసిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా చెరువుల పూడికను తీయడంతో నీటి సామర్థ్యం పెరిగి వ్యవసాయ బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరిగిందన్నారు.


హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డాక్టర్ సంజయ్ భారీ మెజార్టీతో గెలిపించినందుకు జగిత్యాల ప్రజలను అభినందిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో తెలంగాణ ఏర్పడక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల సా మర్థ్యం ఉన్న గోదాములు ఉంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదా ములను నిర్మించిందన్నారు. హమాలీల సమస్యల పరిష్కారానికి రూ. 1.30 కోట్ల నిధులు ఇచ్చినందుకు చైర్మన్ సామేల్ కృతజ్ఞతలు తెలిపారు. రైతులు పండించిన పంటలను విక్రయించడమే కాకుండా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ద్వారా ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తామన్నారు. రోళ్లవా గు ప్రాజెక్టును వేగవంతం చేశామని త్వరలోనే పూ ర్తి చేస్తామన్నారు. ఇక్కడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలుగూరి దామోదర్ జగిత్యాల అర్భన్, రూరల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జుంబర్తి శంకర్, నక్కల రవీందర్ గిడ్డంగుల సంస్థ కార్యదర్శి వైబజార్, రీజినల్ మేనేజర్ కృష్ణమాచారి, గోడౌన్ మేనేజర్ రాజ్యలక్ష్మి, డీఈ భూమేష్, మహేందర్ శ్రీహరి, మనోహర్ రహీం, అయిల్నేని వెంకటేశ్వరరావు, సిరిపురం జితేందర్, దావ సురేశ్, చందా విద్యాసాగర్ ఎలిగేటి అనిల్ తదితరులు న్నారు.

122

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles