పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

Tue,January 22, 2019 02:08 AM

సారంగాపూర్:జిల్లాలో మొదటి విడత ఆరు మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సారంగాపూర్, బీర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సా రంగాపూర్ మండలం రేచపల్లి, బీర్ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల ల్లో ఎన్ని కల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడు తూ ఒంటి గంట తర్వాత లైన్ ఓటర్లు ఉంటే సద్విని యోగం చేసుకునేలా చూడాలని తెలిపా రు. మొదటి విడతలోని 121గ్రామ పంచాయతీ ల్లోని 1084వార్డుల్లోని 1,55,269మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపా రు. ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిం దన్నారు. రేచపల్లి గ్రామంలో మారుమూ ల ప్రాంతం నుంచి వచ్చి ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించుకుంటున్నారన్నారు. శాసన సభ ఎన్నికల మాదిరిగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాలతో పాటు పటి ష్టమై న పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామ న్నా రు. రెండో, మూడో దశకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపా రు. ఇక్కడ ఆర్డీవో జి నరేందర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులున్నారు

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles