గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

Tue,January 22, 2019 02:08 AM

- కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్
-ఏకగ్రీవ సర్పంచులకు సన్మానం
మెట్ టౌన్: ప్రజలు నమ్మకంగా ఎన్నకున్న సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాల్లో అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలనీ, అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చింతలపేట గ్రామ సర్పంచ్ మ్యాకల అర్చన, రామారావుపల్లె గ్రామ సర్పంచ్ లక్ష్మీ, ఏఎస్ తండా గ్రామ సర్పంచ్ గజ్జెల నరేశ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ టీఆర్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఎమ్మెల్యే విద్యాసాగర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమనీ, ప్రభుత్వానికి, ప్రజలకుమధ్య వారధిగా పనిచేసేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్న సందర్భాల్లో తన దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఇక్కడ ఎంపీటీసీ సభ్యుడు జగన్ జాగృతి విద్యార్థి విభాగం నాయకులు కొండ యుగేంధర్, చింతలపేట మాజీ సర్పంచ్ చిన్నయ్య, అంజాగౌడ్, నర్సారెడ్డి, నాయకులు గోవింద్ నాయక్, శోభన్, అన్నారపు సత్యనారాయణ, మహిపాల్ రాజగంగారాం, నర్సయ్య, రమేశ్, చిన్నయ్య, ముత్యంరెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles