కాళేశ్వరాన ఉన్నతాధికారుల బృందం

Mon,January 21, 2019 12:32 AM

ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారం శివారులో కాళేశ్వరం ప్రాజెక్ట్ 6వ ప్యాకేజీ అండర్‌టన్నెల్‌ను ఆదివారం కరీంనగర్ డీఐజీ ప్రమోద్ కుమార్, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్, ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ వైస్ చైర్మన్ వీ వెంకటరమణ, రాష్ట్ర టీఎన్‌జీఓ అధ్యక్షుడు జగదీశ్, రిటైర్డ్ జడ్జి రాజేంద్రకుమార్ బృందం సందర్శించింది. మొదట టన్నెల్‌లోని పంప్‌హౌస్‌ను పరిశీలించగా, ఇక్కడ జరుగుతున్న పనుల పురోగతిని ప్రాజెక్ట్ ఈఈ నూనె శ్రీధర్ వివరించారు. ఇప్పటికే 2 పంపుల డ్రైరన్ పూర్తయ్యాయనీ, మరో రెండు పంపులు సిద్ధమవుతున్నాయని ఆయన వారికి వివరించారు. అనంతరం అధికారుల బృం దం సర్జ్‌ఫుల్ (నీటి నిల్వప్రదేశం)ను పైభాగం నుంచి పరిశీలించారు. సర్జ్‌ఫుల్ 7 గేట్ల బిగింపు పూర్తయిందనీ, ఇంకా అంతర్భాగంలో చిన్నచిన్న పనులు జరుగుతున్నాయని ఈఈ శ్రీధర్ వారికి వివరించారు. అనంతరం వారు జీఐఎస్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. సబ్ స్టేషన్ ఆరుబయట కంటే టన్నెల్‌లో తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన తీరు, దాని విశిష్టత గురించి సదరు బృంద సభ్యులు తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ సబ్ స్టేషన్ చార్జి చేసి ఉందనీ, టన్నెల్‌లో పంపులు రన్ కాగానే ఇక్కడ నుంచి విద్యుత్తు సరఫరా జరుగుతుందని ఈఈ శ్రీధర్ వారికి చెప్పారు. ప్రాజెక్ట్ ఏఈ ఉపేందర్, ధర్మారం ఎస్‌ఐ కే ప్రేమ్‌కుమార్ ఉన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles