జాతీయ కరాటే చాంపియన్‌గా తెలంగాణ

Mon,January 21, 2019 12:31 AM

కరీంనగర్ స్పోర్ట్స్: జాతీయస్థాయి రిపబ్లిక్ డే కప్-2019 కరాటే పోటీల్లో ఆతిధ్య తెలంగాణ రాష్ట్రక్రీడాకారులు సత్తాచాటారు. అత్యధిక పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవ సం చేసుకున్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, కుమిటీ, కటాలో అద్బుత పోరాట పటిమను కనబరిచి తెలంగాణ రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు టోర్నమెంట్‌లో 167 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపీయన్‌గా నిలిచారు. ద్వితీ య, తృతీయ, నాల్గో స్థానంలో వరుసగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా జట్లు నిలిచాయి. గత మూడు రోజులుగా కరీంనగర్ అంబేద్కర్‌స్టేడియంలో జరుగుతున్న జాతీయ రిపబ్లిక్ డే కప్ 2019 కరాటే చాంపీయన్‌షిప్ పోటీలు ఆదివా రం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా సుమారు 20 రాష్ర్టాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. రాత్రి జరిగన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమ కార్యక్రమానికి జిల్లా యువజన, క్రీడాశాఖాధికారి జీ అశోక్‌కుమార్, సీఎస్‌కేఐ చైర్మన్ చల్ల హరిశంకర్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి హాజరై ట్రోఫీలను అందజేశారు.

ఈ సం దర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ కరాటేతో విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. చైర్మన్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ వరుసగా నాలుగుసార్లు జాతీయస్థాయి కరాటే పోటీలను అట్టహాసంగా ని ర్వహించామన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఒలంపిక్‌లాంటి మెగా పోటీల్లో కరాటేకు చోటు దక్కడం అభినందనీయమన్నారు. నిర్వాహకుడు ఇ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీలకు సుమారు 20 రాష్ర్టాలకు పై గా క్రీడాకారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారన్నారు. క్రీడాకారులందరికీ ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం విజేతల కు అతిథులు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిహాన్ షోటోకాన్ అధ్యక్షుడు రవీంద ర్, ఎస్వీస్ ట్రావెల్స్ ప్రతినిధులు సాధిక్ పాష పళగిరి, సీఎస్‌కేఐ ప్రతినిధులు మాడుగుల ప్రవీణ్, వంగల శ్రీధర్, ఆర్ ప్రసన్నకృష్ణ, షుటోరియస్ స్టే ట్ చీఫ్ తగరపు శంకర్‌లతో పాటు కోచ్‌లు, మేనేజర్‌లు పాల్గొన్నారు. ఇటీవల కామన్‌వెల్త్ కరాటే పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను సత్కరించారు.

చాంపియన్లు వీరే...
జాతీయకరాటే చాంపియన్‌గా తెలంగాణ జట్టు 167 పాయింట్లు సాధించగా ఆ తర్వాత స్థానం లో 156 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్, 147 పా యింట్లతో మూడో స్థానంలో కర్ణాటక, 122 పాయింట్లతో నాల్గో స్థానంలో హర్యానా, తమిళనాడు 101 పాయింట్లతో 5వ స్థానం, మధ్యప్రదేశ్ 97 పాయింట్లతో ఆరోస్థానం, పంజాబ్ 86 పాయింట్లతో ఏడో స్థానం సాధించాయి.

బైక్‌ను గెలచుకున్న గోవా క్రీడాకారిణి
జాతీయ కరాటే పోటీల్లో భాగంగా మహిళల విభాగంలో అద్వితీయ ప్రతిభ చూపిన గోవాకి చెందిన క్రీడాకారిణి భువనేశ్వరి జూపిటర్ బైక్‌ను గెలుచుకుంది.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles