తొలి’ ఎన్నికకు రెడీ

Sun,January 20, 2019 12:44 AM

- రేపే మొదటి విడత పంచాయతీ పోరు
- ఆరు మండలాల్లోని 121సర్పంచు..
- 821 వార్డుల్లో ఎన్నికలు..
- బరిలో 2,476 మంది అభ్యర్థులు
- సర్వం సిద్ధం చేసిన అధికారులు..
- 1,068పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
- విధుల్లో 2900మందికి సిబ్బంది
- బందోబస్తులో 650మంది పోలీసులు
జగిత్యాల, నమస్తే తెలంగాణ : తొలి పల్లె పోరుకు జిల్లాలో సర్వం సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా ఆరు మండలాల పరిధిలో సోమవారం ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఏకగ్రీవమైన 10సర్పంచ్, 318వార్డు స్థానాలు పోను, 121 సర్పంచ్, 821వార్డు స్థానాల్లో పోలింగ్, కౌంటింగ్ అన్ని ఏర్పాట్లూ చేసింది. మొత్తంగా 1068పోలింగ్ కేంద్రాలు కేటాయించడంతోపాటు అవసరమైన సిబ్బందిని కూడా నియమించింది.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ధర్మపురి, సారంగాపూర్, బీర్ రాయికల్, వెల్గటూర్, బుగ్గారం మండలాల్లో జరిగే ఎన్నికలకు 1,068పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు జోన్లు, రూట్లను ఏర్పాటు చేసి అధికారులను నియమించారు. అదనంగా చెక్ ప్లయింగ్ స్కౌడ్ నియమించారు. సమస్యాత్మక గ్రామాల్లో 22 మంది సూక్ష్మ పరిశీలకులు, 33 కేంద్రాల్లో వెబ్ సేవలు అందుబాటులో ఉంచారు. సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వ రంగ సిబ్బందిని నియమించారు. వీరికి రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు విజేంద్ర స్వయంగా శిక్షణ ఇచ్చారు. వెబ్ కాస్టింగ్ సిస్టంను కలెక్టర్ శరత్, సబ్ కలెక్టర్ గౌతం, జేసీ రాజేశం, ఆర్డీవోలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 2900మంది సిబ్బందిని నియమించారు. సిబ్బంది కోసం 6 మండలాల్లో 86 బస్సులు, 27 కార్లు, జీపులు సిద్ధం చేసినట్లు పంచాయతీ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందుకోసం జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. 650 మంది పోలీసు సిబ్బందిని తొలి విడత ఎన్నికల్లో వినియోగించుకుంటున్నామన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

తొలి విడత బరిలో 2,476 మంది..
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 121 సర్పంచు స్థానాలకు 484మంది, 821వార్డులకు 1,993మంది చొప్పున మొత్తం 2,476మంది పోటీ పడుతున్నారు. రాయికల్ మండలంలో 32పంచాయతీల్లో రెండు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 30 స్థానాల్లో 124 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 199 వార్డు స్థానాలకు గానూ 82 వార్డులు ఏకగ్రీవం కాగా 111 వార్డు స్థానాల్లో 480 మంది బరిలో ఉన్నారు. సారంగాపూర్ మండలంలో 18 జీపీలకు 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 15 స్థానాల్లో 59 మంది బరిలో ఉండగా 144 వార్డు స్థానాలకు గానూ 34 ఏకగ్రీవం కాగా 110 స్థానాలకు 270 మంది బరిలో ఉన్నారు. బీర్ మండలంలో 15 సర్పంచ్ స్థానాలకు గానూ ఒకటి ఏకగ్రీవం కాగా, 14 స్థానాల్లో 52 మంది, 124 వార్డులకు గానూ 16 ఏకగ్రీవం కాగా మిగిలిన 108 స్థానాలకు 257 మంది బరిలో ఉన్నారు. ధర్మపురి మండలంలో 25 స్థానా లకు గానూ మూడు ఏకగ్రీవం కాగా 22 స్థానాలకు గానూ 85 మంది బరిలో ఉ న్నారు. 224 వార్డులకు 97 ఏకగ్రీవం కాగా 303 మంది బరిలో ఉన్నారు. వెల్గటూర్ మండంలో 30 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 29 స్థానాలకు 120 మంది, 274 వార్డు స్థానాలకు 65 ఏకగ్రీవం కాగా 486 మంది బరిలో నిలిచారు. బుగ్గారం మండలంలో 11 జీపీలకు 43 మంది బరిలో ఉన్నారు. 104 వార్డు స్థానాలకు 197 మంది బరిలో ఉన్నారు.

ఈ జాగ్రత్తలు తప్పని సరి
పోలింగ్ రోజున అధికారులు, అభ్యర్థులు, ఓటర్లు, రాజకీయ పార్టీలు పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది.
*మద్దతుదాలు..
కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఎక్కడా నలుగురికంటే ఎక్కువగా గుమికూడవద్దు. చర్చలు నిర్వహించడం వంటి పనులు చేయకూడదు.
పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
కేంద్రాల వద్ద నిర్ణీత దూరంలోపు రాజకీయ పార్టీలు సమావేశాలు, శిబిరాలు పెట్టవద్దు.
మీటర్ల దూరం తర్వాత ప్రచార పత్రాలు పంచాల్సి ఉంటుంది.
కేంద్రం ప్రాంగణంలోకి రాకూడదు.
అభ్యర్థులు..
స్టేషన్లలో తమకు మద్దతుగా ప్రచారానికి ఉపయోగపడేలా పోస్టర్లు జెండాలు, చిహ్నాలు, గుర్తులు, స్టిక్కర్లు వినియోగించవద్దు.
కేంద్రాల్లో అభ్యర్థులు ప్రచారం, సైగలు ప్రదర్శించవద్దు.
కమిషన్ అనుమతి ఉన్న వాహనాలనే అభ్యర్థులు వినియోగించాలి.
సంబంధిత అనుమతి పత్రాలను వాహనం ముందు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి.
ఫలితాల అనంతరం విజయోత్సవ సభలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాలి.
అధికారులు..
కమిషన్ జారీ చేసిన పాస్ ఉన్నవారినే లోపలికి అనుమతించాలి.

ఓటర్లు..
స్టేషన్లలో ఎంచుకునే అభ్యర్థికి సంబంధించి స్వస్తిక్ గుర్తును వేసే ముందు ఆ బ్యాలెట్ ఎలా మడవాలో అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.
ఓటు ఖచ్చితంగా తాము మద్దతు పలికే అభ్యర్థికి కేటాయించిన బాక్సులోని గుర్తుపైనే వేయాలి.
గుర్తులకు మధ్యలో వేసినా కాగితాన్ని మడవడంలో తేడా ఉన్నా చెల్లని ఓటుగా పరిగణిస్తారు.
వేయగానే పోలింగ్ బూత్ విడిచి రావాలి.
ఓటర్లను ప్రభావితం చేయడం, మాట్లాడడం నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు.
ఒక్కరే పోలింగ్ బూత్ వెళ్లాలి
వారు, వయోవృద్ధులు, దివ్యాంగులు ఉంటే అక్కడి సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles