ముగిసిన నామినేషన్ల పరిశీలన..


Sun,January 20, 2019 12:42 AM

-19 సర్పంచ్ స్థానాలకు 133 , 186 వార్డులకు 536 నామినేషన్లు ఆమోదం..
-3 నామినేషన్ల తిరస్కరణ
మల్యాల : మూడో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈనెల 16,17,18 తేదీల్లో నామినేషన్లు స్వీకరించగా, శనివారం రిటర్నింగ్ అధికారులు దాఖ లు చేసిన నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు మల్యాల ఎంపీడీవో సుధాకర్ తెలిపారు. 19 సర్పంచ్ స్థానాలకు గానూ గుడిపేట గ్రామ పంచాయతీకి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కాగా, మిగిలిన 18గ్రామ పంచాయతీలకు గానూ 133మంది బరిలో నిలవనున్నట్లు తెలిపారు. 186వార్డులకు గానూ 17వార్డుల్లో ఒక్కో నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. గొర్రెగుండంలో రెండు వార్డులకు, రామన్నపేటలో నాలుగు వార్డులు, తక్కళ్లపెల్లిలో ఒక వార్డు, మ్యాడంపెల్లిలో రెండు వార్డులు, మానాలలో ఒక వార్డు, లంబాడిపల్లిలో ఒక వార్డు, గుడిపేటలో ఆరు వా ర్డులకు ఒక్కో నామినేషన్లు మాత్రమే దాఖలవడంతో వాటిని ఏకగ్రీవంగా ఆమోదించనున్నారు.


మిగిలిన 169స్థానాలకు గానూ 536మంది బరిలో నిలవనున్నారు. నామినేషన్లు సరిగా నింపకుండా రాంపూర్ 9వ వార్డులో బొల్లె చిన్న గంగయ్య, బల్వంతాపూర్ 6వ వా ర్డులో కోను పెద్ద గంగయ్య, సర్వాపూర్ 6వ వార్డులో మీస సహదేవ్ సమర్పించిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు. నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు అప్పీలు చేసుకునేందుకు జగిత్యాల ఆర్డీవో డాక్టర్ ఘంటా నరేందర్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ము త్యంపేట గ్రామ సర్పంచ్ స్థానానికి పరిశీలన జరుగుతున్న సమయంలో మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి పోటీ చేస్తున్న బద్దం తిరుపతి రెడ్డిపై రిటర్నింగ్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా మల్యాల రిటర్నింగ్ అధికారి అం జారెడ్డి పూర్తిస్థాయి విచారణ జరిపి బద్దం తిరుపతి రెడ్డి నామినేషన్ చెల్లుబాటు అవుతుందని ప్రకటించారు. ఈ నెల 20న తిరస్కరణకు గురైన అప్పీల్లను ఆర్డీవో స్వీకరించి ఈనెల 21 లోపు పరిష్కరించాక ఈనెల 22న మధ్యాహ్నం 3గంటలలోపు ఉప సంహరణకు అవకాశం ఉందని, 3గంటల తర్వాత గుర్తులను కేటాయించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

74

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles