అంజన్న ఆలయంలో అంతర్గత బదిలీలు

Sun,January 20, 2019 12:41 AM

-ఎట్టకేలకు 12మందిని బదిలీ చేసిన ఆలయ ఈవో అమరేందర్
మల్యాల: కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఆలయ ఉద్యోగులుగా పనిచేస్తున్న 12మందిని అంతర్గతంగా శాఖల బదిలీ కార్యక్రమాన్ని ఆలయ ఈవో అమరేందర్ చేపట్టారు. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లకు సంబంధించిన 12 మందిని బదిలీ చేశారు. బదిలీ అయిన వారి లో జీ శ్రీనివాస శర్మను దేవాలయం, అన్నదానం, పడితరము విభాగ పర్యవేక్షుడిగా, వైరాగ్యం అం జయ్యను కార్యాలయ పర్యవేక్షణ, ఎస్టాబ్లిష్ ట్ అకౌంట్ డబ్బులు పంపించడం, మనీ వా ల్యూడ్ నిర్వాహణ, ఇంజినీరింగ్ విభాగం, ఆగమ పాఠశాల నిర్వాహణ పర్యవేక్షకుడిగా బదిలీ చేశారు. సునిల్ కుమార్ సానిటేషన్ విభాగం, గదుల నిర్వాహణ పర్యవేక్షణ, నీటి నిర్వాహణ పర్యవేక్షకులుగా, టీ రాజేశ్వర్ రావును లడ్డూ, ప్రసాదం తయారీ విభాగం నుంచి టెంపుల్ ఇన్ కే శ్రీనివాస చారిని అకౌంట్స్ నిర్వాహణ, కంప్యూటర్ నిర్వాహణ, ఆలయ ఇన్ అవుట్ నిర్వాహణ, అన్నదానం, వేలంల పశుపోషణ, తలనీలాల టెండర్, సప్లయి టెండర్లు, ఇతర పనులను నిర్వాహించేందుకు అంతర్గతంగా బదిలీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్న ధర్మేందర్ ఏఈవో పర్యవేక్షణలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ విభాగానికి, జీ శ్రీనివాస్ దేవాలయం నుంచి లడ్డూ, పులిహోర ప్రసాదం బుకింగ్ కౌంటర్ జీ రాజేందర్ రెడ్డిని ఆగ మ పాఠశాల, ఆలయానికి విరాళాలు సేకరించడం, సంపత్ కుమార్ ఆలయ రెండో ఇన్ బీ లక్ష్మీరాజంను ఆలయ ముఖ్య బుకింగ్ కౌంటర్ జీ సుధాకర్ రెడ్డిని ఇతర ఉద్యోగులు సెలవులపై వెళ్లినప్పుడు వారి విధులను నిర్వహించేలా బదిలీ చేశారు. రికార్డు అసిస్టెంట్ ఉన్న ఎ వసంతను లడ్డూ బుకింగ్ కౌంటర్ నుంచి గదుల విచారణ కార్యాలయంలో విధులు నిర్వహించాలని లేఖ నంబర్ ఏ/03,2019 తేదీ 18.1. 2019నుంచి బదిలీ అయిన వారు ఉద్యోగాల్లో నూతన విధుల్లో చేరాలని ఆలయ ఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles