మల్లాపూర్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగం గా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవిని కొంత మంది ఎన్నికల బరిలో ఉన్న ఆభ్యర్థులు సందిరెడ్డి శ్రీనివాస్ క్యాతం జీవన్ మధ్య రాజీ కుదర్చడంతో పా టు, వేలం పాట నిర్వహించి రూ. 20 లక్షలకు సర్పంచ్ పదవిని క్యాతం జీవన్ ఏకగ్రీవంగా ఇచ్చారని నిరసిస్తు గ్రామానికి చెందిన యువజన సంఘాల నాయకులు శనివారం అందోళన చేశా రు. ప్రజాస్వామ్యంలో సర్పంచ్ ఎన్నికను వేలం వేయడం సరికాదనీ, సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న ఆకుతోట నర్సయ్యను భయబ్రంతులకు గురి చేసి నామినేషన్ విత్ డ్రా చేయించారని ఆరోపించారు. ఇప్పటికే జిల్లా అధికారులకు తా ము ఫిర్యాదు చేశామనీ, వెంటనే సంబధిత అధికారులు స్పందించి సర్పంచ్ ఎన్నికను రద్దు చే యాలని కోరారు. అందోళనలో భాగంగా గ్రామానికి చెందిన ఏనుగు వెంకట్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించా డు. అశ్విన్, అంజయ్య, సురేష్, ప్రభాకర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ పృథ్వీదర్ సంఘటన స్థలానికి చేరుకొని యువకులతో మాట్లాడి శాంతింపజేశారు.