ఓటు చైతన్యంపై విద్యార్థులకు పోటీలు


Sat,January 19, 2019 12:34 AM

జగిత్యాల టౌన్ : ఓటరు చైతన్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు జగిత్యాల మండల స్థాయి పోటీలు స్థానిక పురానిపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈనెల 25న జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వ హించినట్లు మండల విద్యాధికారి ఎం.నారాయణ తెలి పారు. వ్యాసరచన పోటీల్లో తెలుగు మీడియంలో జగి త్యాల జీహెచ్ బాలికల పాఠశాలకు చెందిన ఏ వనజ ప్రథమ స్థానంలో, మోతె జెడ్పీహెచ్ పాఠశాలకు చెం దిన బీ రినిత ద్వితీయ, పురాణిపేట జీహెచ్ పాఠశాల కు చెందిన ఓ జీవన తృతీయ, ఇంగ్లిష్ మీడియంలో ఓల్డ్ హైస్కూల్ చెందిన ఎన్. మేఘన ప్రథమ, జీహెచ్ బాలికల పాఠశాలకు చెందిన పీ సాయితేజ ద్వితీయ, ఓల్డ్ హైస్కూల్ చెందిన ఏ హేమల త తృతీయ, ఉర్దూ మీడియంలో ఖాజీపుర జీహెచ్ చెందిన రఫియా తహనియాత్ ప్రథమ, నసెహ నాజ్ ద్వితీయ, ఫోర్ట్ హైస్కూల్ చెందిన రఫత్ ఫాతిమా తృతీయ, ఉపన్యాస పోటీల్లో తెలుగు మీడియంలో మోతె జెడ్పీహెచ్ చెందిన జే రష్మిత ప్రథమ, కండ్లపల్లి టీఎస్ చెందిన డీ రాజు ద్వితీయ, ఇంగ్లిష్ మీడియంలో జగి త్యాల టీఎస్ చెందిన ఎం.పావని ప్రథ మ, ఓల్డ్ హైస్కూల్ చెందిన ఎస్.సృతి ద్వితీయ, పీ ప్రవలిక తృతీయ, ఉర్దూ మీడియంలో ఖాజీపురకు చెందిన హఫ్ అల్ ప్రథమ, రజ నూర్ ద్వితీయ, ఈష రక్షి తృతీయ స్థానాల్లో నిలిచారు. మండల స్థాయి లో గెలుపొందిన విద్యార్థులు ఈనెల 19న జరిపే నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొనాలని విద్యాధికారి నారాయణ సూచించారు.

100

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles