స్వచ్ఛ సర్వేక్షన్ భాగస్వాములవ్వాలి

Sat,January 19, 2019 12:33 AM

-జేసీ రాజేశం
జగిత్యాల అర్భన్ : స్వచ్ఛ సర్వేక్షన్ ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని జగిత్యాల జా యింట్ కలెక్టర్ రాజేశం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీని జెండాఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను పరిశుభ్రంపై చైతన్యంపరిచి స్థిరమైన బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా మార్చాలన్నారు. 2019 స్వచ్ఛసర్వేక్షన్ భాగంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకొని వారి టి మాత్రమే ఉపయోగించుకోవాలన్నారు. చెత్తను తిరిగి వినియోగించడంపై ప్రజలకు అవగాహన రావాలని తెలుపుతూ ప్రజలు తమ అభిప్రాయాలను స్వచ్ఛత ఆప్ డౌన్ చేసుకొని ఫీడ్ తెలియజేయాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను స్వచ్ఛత యాప్ ఇంటి వద్దనే ఉండి నేరుగా తమ సమస్యలను పరిష్కార కోసం తెలియజేయాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని పారిశుధ్య కార్మికులే మన సంతోషానికి, ఆరోగ్యానికి కారకులు కాబట్టి వారికి సహకరించి స్వచ్ఛ జగిత్యాలను సాదిద్దామన్నారు. పట్టణాన్ని స్వచ్ఛ జగిత్యాల పట్టణంగా మార్చుటకు ప్రజలు తమ అభిప్రాయాలను జనవరి 31లోపు 1969 కు కాల్ చేసి లేదా స్వచ్ఛత యాప్ తెలియజేసి స్వచ్ఛ సర్వేక్షన్ 2019లో మెరుగైన ర్యాంక్ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ మేనేజర్ శ్యామ్ నోడల్ ఆఫీసర్ లచ్చిరెడ్డి, సానిటరి ఇన్ దేవేందర్, కౌన్సిలర్లు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

144
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles