ఖర్చుల వివరాలను విధిగా అందజేయాలి

Fri,January 18, 2019 01:07 AM

- ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకుడు శుజాఉద్దీన్
పెగడపలి: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చుల వివరాలను విధిగా అందజేయాలని పెగడపల్లి మండల సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎండీ శుజాఉద్దీన్ సూ చించారు. మండల పరిషత్ కార్యాలయంలో గరువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుసభ్యుల పదవులకు పోటీచేస్తున్న అభ్యర్థులు నా మినేషన్ సమయంలో ఇచ్చిన బ్యాంకు ఖాతా నిర్వహణతో పాటు, ఖ ర్చుల వివరాలను ఒక రిజిష్టర్‌లో నమోదు చేయాలని వివరించారు. రూ.5వేల పైన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ. 2.50 లక్షలు, వార్డుసభ్యులు రూ.50 వేలు, 5వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డుసభ్యులు రూ. 30 వేల వరకు ఖర్చు చేయవచ్చన్నారు.

మండలంలో ఒక్క బతికపల్లి గ్రామం మాత్రమే రూ.5వేల పైబడి జనాభా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతీ అభ్యర్థి ఎన్నికల నియమావళిని పాటించాలని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైప్పటి నుంచి పోలింగ్ ముగి సేంత వరకు మూడు విడతలుగా ఎన్నికల ఖర్చుల వివరాలను తమకు అందజేయాలని, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక 45 రోజుల్లోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను అందించాలని తెలిపారు. అభ్యర్థులు ప్రచార సామగ్రి ముద్రణ కొరకు ఎంపీడీవో ది వ్యదర్శన్‌రావు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని శుజాఉద్దీన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఈవోఆర్డీ జయశీల, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులున్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles