మరుగుదొడ్లను ఆలంకరించండి

Fri,January 18, 2019 01:06 AM

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రభుత్వ సాయంతో నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్లను ఆలంకరించాలని కలెక్టర్ శరత్ సూచించారు. జిల్లా జరుగుతున్న స్వచ్ఛ సుందర్ శౌచాలయ్‌పై గురువారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ మండలాల వారీగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలోని అన్ని గ్రామాల్లో ఇంటి యాజమాని స్వంతంగా నిర్మించుకున్న, ప్రభుత్వ సహాయంతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రభుత్వ సహాకారంతో నిర్మించిన మరుగుదొడ్లను కలుపుకుని రంగులు వేయాలని తెలిపారు రంగులు వేసుకోకుండా ఉన్నవాటిని గుర్తించి వాటికి రంగులు వేసేలా ప్రోత్సహించాలనీ, పేదవారు ఉన్నట్లయితే వారిని గుర్తించి వారికి అవసరమైన రంగులను, బ్రష్షులను పంపిణీ చేసి రంగులు వేయించాలన్నారు. ఇంటి యాజమాని తన స్వంత డబ్బు తో కలర్ వేసుకోనట్లయితే వాటిని కూడా పర్యవేక్షించి వాటి ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో పొందు పరచాలని తెలిపారు. పరిసరాలను కూడా పరిశుభ్రంగా అందం గా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.

మరుగుదొడ్లకు రంగులు వేసి పరిసరాలు అందంగా ఉండే లా తీర్చిదిద్దిన వాటిని గుర్తిం చి ప్రతి గ్రామం నుంచి ఐదు ఫొటోలను తీసి ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాలని తెలి పారు. పరిసరాలు పరిశుభ్రం గా ఉన్నట్లయితే కీటకాలు, దోమల వల న అనారోగ్యాల భారిన పడకుండా పూర్తి ఆరోగ్యకరమైన కుటుంబం తయారవుతుందని పేర్కొన్నారు. గ్రామం, మండలంతో పాటు, జిల్లా కూడా ఆరోగ్యకరమైన వాతావరణంతో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రజల్లో సంపూర్ణ అవగాహనను కల్పించుటకు గ్రామాల్లోని మహిళా సంఘాలు, స్వచ్ఛంద కమిటీలు, స్వశక్తి గ్రూపులను కలుపుకుని గ్రామాల్లో వందశాతం పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లోని కమిటీ హాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన వాటికి కూడా రంగులు వేయాలని సూచించారు. అనంతరం వన్‌జీపీ, వన్ నర్సరీపై మండలాల వారీగా సమీక్షిస్తూ, విత్తనాలను ఈనెల 27వ తేదీ నాటికి పంపిణీ చే యాలన్నారు. 2017-18లో నర్సరీలలో మొక్కలకు నీరు పోసిన వారికి చెల్లింపులు చెల్లింపులను చేస్తున్నారా, నర్సరీలలోని మొక్కల పురోగతిపై ఆరాతీశారు. నర్సరీలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ భిక్షపతి, ఏపీడీ, ఏపీఎంలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles