టీఆర్‌ఎస్‌లో చేరిన మహాకూటమి నాయకులు

Fri,January 18, 2019 01:06 AM

మల్యాల : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నేరెళ్ల శ్రావణ్ రెడ్డి, గొర్రెగుండం గ్రామానికి చెందిన మహాకూటమి నాయకులు గుర్రం శేఖర్ గౌడ్, పద్మారాజు, తిరుపతి టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మిట్టపెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మిట్టపెల్లి సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి రథ సారథి, సీఎం కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి పనులతో పాటు సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రజాధరణను చూసి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. అనంతరం సుదర్శన్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జనగాం శ్రీనివాస్, మిట్టపెల్లి పవన్, పోతాని రవి, ఆగంతం వంశీదర్, దూస వెంకన్న, జనగాం శేఖర్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, నేరెళ్ల భూం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles