పల్లెల్లో ఓట్ల పండుగ!

Tue,January 15, 2019 05:27 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఓ వైపు సంక్రాంతి సంబురాలు.. మరోవైపు పంచాయతీ ఎన్నికలు.. వెరసి పల్లెల్లో పండుగ జోష్ రెట్టింపయింది. గతంలో కంటే ఈసారి ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొన్నది. ఎక్కడెక్కడి నుంచో సొంతూళ్లకు చేరుకున్న పట్టణవాసులను అభ్యర్థులు ఆత్మీయంగా పలుకరిస్తూ.. ఓటర్లను ఆకట్టుకోవడం కనిపిస్తున్నది. ఇటు సొంత ఖర్చులతో ముగ్గులు, క్రీడా పోటీలు, ప్రత్యేక దావత్‌లు ఏర్పాటు చేస్తుండగా, ఏ ఇంట చూసినా ఎన్నికలపైనే చర్చ సాగుతున్నది..

ఆకట్టుకునే గంగిరెద్దుల విన్యాసాలు.. భోగిమంటలు.. పిండివం టల ఘుమఘుమలకుతోడు పంచాయతీ ఎన్నికలు, పల్లెల్లో సం క్రాంతి సంబురాలను రెట్టింపు చేస్తున్నాయి. ఎక్కడా చూసినా సరి కొత్త శోభను తీసుకవస్తున్నాయి. మరోవైపు రాజకీయ పందెంకోళ్లు కాకరేపుతున్నాయి. ప్రచార గోదాలోకి దిగి సై అంటే సై అంటు న్నాయి. పండుగ వేళ సొంతూళ్లకు చేరుతున్న ఓటర్లను కలిసి ఆత్మీ యంగా పలకరిస్తూనే మరోవైపు ఓట్లను అభ్యర్థిస్తున్న సన్నివేశాలే దర్శనమిస్తున్నాయి. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి సొం త ఖర్చులతో వేడుకలను నిర్వహిస్తూ.. క్రీడా, ముగ్గుల పోటీలను ఏర్పాట్లు చేస్తూ.. దావత్‌లను ఇస్తూ.. ఆకట్టుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందడిని రెట్టింపు చేస్తున్నారు.

పండుగ పూట పలకరింపులు..
ఈ నెల ఒకటిన పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, అప్పటి నుం చే పల్లెల్లో సందడి మొదలైంది. రాష్ట్ర సర్కారు సర్పంచులకు పెద్ద ఎత్తున నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించడంతో బరిలో నిలిచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. యువత, మేధావులు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారా లు చేసే వారితోపాటు విదేశాల్లో ఉండి వచ్చిన వారు కూడా ఈసారి ఎన్నికల్లో త మ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి విడత, రెం డో విడత నామినేషన్లు పెద్దసంఖ్యలో వేశారు. ఇదే సమయంలో సంక్రాంతి రాగా, ఇదే వేదికగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పండుగ కోసం ఎక్కడెక్కడి నుంచో తమ సొంతూళ్లకు చేరుకుంటున్న పట్టణవాసులను ఆత్మీయంగా పలుకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులందరినీ కలుస్తూ.. అన్నా తమ్మీ.. అక్కా చెల్లీ.. అత్తా మామా.. బాపూ అమ్మా.. అంటూ వరుసలు కలుపుతున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే, కొత్త ప్రేమలను కురిపిస్తున్నారు. యోగక్షేమాలు అడుగుతూనే, తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల సొంత ఖర్చులతో వేడుకలు నిర్వహిస్తుండగా, మరికొందరైతే దావత్‌లు ఆఫర్ చేస్తున్నారు.

ఆకట్టుకునే విన్యాసాలు..
ఓటర్లను ఆకట్టుకునేందుకు.. గెలుపును వశం చేసుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అనేక దారులను వెతుకుతున్నారు. యువకులు.. మహిళలు.. పురుషులు.. వృద్ధుల వారీగా ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్ర విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. సొంత ఖర్చులతో వేడుకలను నిర్వహిస్తున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలను.. యువకులకు క్రీడాపోటీలను జరుపుతూ ప్రోత్సాహక బహుమతులను ఎరవేస్తున్నారు. ప్రత్యేకంగా దావత్‌లు ఇస్తూ తమపై తిప్పుకుంటున్నారు. మొత్తం మీద సంక్రాంతి పండుగ పూట పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల లొల్లి జోరుగా సాగుతున్నది. ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే జరుగుతున్నది.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles