రెండో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి


Tue,January 15, 2019 05:25 AM

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ: రెండో విడత మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు దాఖలు అయిన నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తైంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి, కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల మండలాల్లోని 122 గ్రామ పంచాయతీ సర్పంచ్, 1172 వార్డు స్థానాలకు గాను సర్పంచ్ స్థానాలకు 880, వార్డు స్థానాలకు 3573 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేని 33 నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. తిరస్కరించిన నామినేషన్లలో సర్పంచ్ స్థానాలకు14 వార్డులకు 19 ఉన్నాయి. మిగతా 3,540 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు పంచాయతీ ఎన్నికల అధికార యంత్రాంగం తెలిపింది. డివిజన్ పరిధిలో 5 సర్పంచ్ ,197 వార్డు స్థానాలకు ఒకటి చొప్పున దాఖలైన నామినేషన్లను ఆమోదించారు. 15న నామినేషన్లపై అభ్యంతరాలు, పరిష్కారం, 16, 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ వెం టనే బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారు, గుర్తుల కేటాయింపు జరుగుతుంది.


ఇబ్రహీంపట్నం మండలంలో..
మండలంలో 17 గ్రామ పంచాయతీలు, 162 వార్డులు ఉన్నాయి. మూడు రోజుల్లో మొత్తం నామినేషన్లు 413 దాఖళయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో రెండు నామినేషన్లను తిరస్కరించారు. వర్షకొండ క్లస్టర్ పరిధిలోని డబ్బ సర్పంచ్ స్థానానికి నా మినేషన్ వేసిన దేశెట్టి శాంత తన నామినేషన్ పత్రం సక్రమంగా పూరించకపోవడంతో ఆమె నామినేషన్ ను తొలగించారు. వర్షకొండ పంచాయతీ పరిధిలోని 12వ వార్డు స్థానానికి నామినేషన్ వేసిన మీరా రాజగంగు నామినేషన్ పత్రంలో సరైన ఆధారాలు చూపకుండా ముగ్గురు పిల్లలు ఉన్నట్లు నామినేషన్ పత్రం లో చూపడంతో ఆమె నామినేషన్ ను తిరస్కరించారు. సర్పంచ్ స్థానానికి 111, వార్డులకు 300 నామినేషన్లు సక్రమంగా ఉండడంతో ఆమోదించారు.

మెట్‌పల్లి మండలంలో..
మండలంలో 23 పంచాయతీలు, 212 వార్డులకు 614 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో భాగంగా మూడు నామినేషన్లు తిరస్కరించారు. అందులో జగ్గసాగర్ సర్పంచ్ స్థానంలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తేలడంతో పుల్ల పుష్పలత వేసిన రెండు నామినేషన్లను, అదే విధంగా పెద్దాపూర్‌లో గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచార ఖర్చులకు సంబంధించిన లెక్కల వివరాలను సమర్పించలేదనే కారణంతో వార్డు సభ్యురాలి నామినేషన్‌ను తిరస్కరించారు. మిగతా అన్ని నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కథలాపూర్ మండలంలో..
మండలంలో 19 పంచాయతీలు, 188 వార్డు స్థా నాలకు గాను 620 నామినేషన్లు వచ్చాయి. పరిశీలనలో భాగంగా వయస్సు తక్కువగా ఉన్న కారణంతో మండల కేంద్రం కథలాపూర్ పంచాయతీ పరిధిలోని 10వ వార్డు అభ్యర్థి కల్లెడ మౌనిక నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో సర్పంచ్ స్థానాలకు 147, వార్డు స్థానాలకు 472 నామినేషన్లు సక్రమంగా ఉండడంతో ఆమోదం పొందాయి.

కోరుట్ల మండలంలో..
మండలంలో 15 పంచాయతీలు, 152 వార్డులు ఉండగా సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 499 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు స్థానాకి ఒకటి నామినేషన్లను తిరస్కరించారు. నాగులపేట సర్పంచ్ స్థానంలో ముగ్గురు పిల్లలు ఉన్న కారణంతో ఆరెళ్లి స్వామి, సంగెంలోని 7వ వార్డులో వయస్సు తక్కువ ఉందనే కారణంతో తుదివేని అఖిల్ కుమార్ నామినేషన్లను తొలగించారు. అదే విధంగా సర్పంచ్ స్థానాలకు 124, వార్డు స్థానాలకు 374 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

మల్లాపూర్ మండలంలో..
మండలంలో 23 పంచాయతీ స్థానాలు, 220 వా ర్డు స్థానాలకు గాను 688 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో భాగంగా సర్పంచ్ స్థానాల్లో 10, వార్డు స్థానాల్లో 12 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి. సర్పంచ్ స్థానాలకు 161, వార్డులకు 505 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేల్చారు.

మేడిపల్లి మండలంలో..
25 పంచాయతీలు, 238 వార్డులకు గాను మొత్తం 739 నామినేషన్లు రాగా పరిశీలనలో భాగంగా మూడు నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. గోవిందారంలో 3వ వార్డు అభ్యర్థి బింగి కావ్య, బీమారంలో 9వ వార్డు అభ్యర్థి కొంక రవళి , కమ్మరిపేటలో 8వ వార్డు అభ్యర్థి జిల్లా రాజేందర్‌ల నామినేషన్లను వివిధ కారణాలతో తొలగించారు. సర్పంచ్ స్థానాలకు 167, వార్డు స్థానాలకు 569 నామినేషన్లు సక్రమమని తేల్చారు.

115

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles