రేపటి నుంచే ఆఖరి పోరు

Tue,January 15, 2019 05:25 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : మూడో విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. స ర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మూడో వి డత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 6 మం డలాల్లో 127 గ్రామ పంచాయతీలు, 1182 వా ర్డు స్థానాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి శుక్రవారం సా యంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరి స్తారు. ఇందుకోసం 41 క్టస్టర్లలో నామినేషన్ పత్రాలు స్వీకరించి, ఈ నెల 22న పోరులో ఉన్న వారి జాబితా ఈనెల 30న పోలింగ్ నిర్వహించి, లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెలువరిస్తారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తుది ఘట్టం రేపు మొదలు కానుంది. వ్యూహ ప్ర తి వ్యూహాలతో ఇప్పటికే వేడెక్కుతున్న గ్రామాల్లో చివరి విడత నామినేషన్ల సందడి ఈనెల 16 బుధ వారం ప్రారంభం కానుంది. ఆరు మండలాల్లోని 127 పంచాయతీల్లో, 1182 వార్డు స్థానాలకు నా మినేషన్ల స్వీకరణ కోసం 41 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి నామినేషన్ కేంద్రంలో పోటీలో నిల బడే అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం హె ల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు గ్రా మాలకు చెందిన పంచాయతీ సిబ్బందిని నియ మించారు. అభ్యర్థుల కోసం అవసరమైన డిక్లరేష న్ పత్రాలు, ఫర్నిచర్, ఇతర సామగ్రిని అందుబా టులో ఉంచారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈనెల 16 శుక్రవారం సాయం త్రం 5 గంటల దాకా నామినేషన్లు స్వీకరించనుం డగా, కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందో బస్తును ఏర్పాటు చేశారు.

క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్లు
పంచాయతీ ఎన్నికల కోసం క్లస్టర్ల వారీగా సం బంధిత రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు వి డుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన నోటీసు లను క్లస్టర్ల కేంద్రాల్లోని పంచాయతీ కార్యాల యాల్లోని నోటీసు బోర్డులపై అంటిస్తారు. ఉద యం 10.30గంటలకు ముందు అధికారులు నో టీసులు జారీ చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 18 వరకు ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు సంబంధిత నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామి నేషన్ల స్క్రూటీని, సాయంత్రం వరకు జాబితాను ప్రకటించడంతో పాటు, 20న అభ్యంతరాల స్వీ కరణ, 21న అభ్యంతరాల పరిశీలన, 22న నామి నేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారు లు విడుదల చేస్తారు.

41 క్లస్టర్లు.. 6 మండలాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత కింద 6 మండలాల్లో 16 నుండి నామినేషన్లు స్వీకరిస్తారు. మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో 127 గ్రామ పంచాయతీల సర్పంచ్, 1182 వార్డు సభ్యుల నామినేషన్లు స్వీ కరించి, ఎన్నికలు జనవరి 30న నిర్వహిస్తారు.

గొల్లపల్లి మండలంలో.. 8 క్లస్టర్లు..
మండలంలో గొల్లపల్లి క్లస్టర్ కేంద్రంలో గొల్లపల్లి, గోవిందుపల్లె గ్రామ పంచాయతీకి సం బంధించి 2 సర్పంచ్ స్థానాలు, 58 వార్డు స్థానా లకు నామినేషన్లు స్వీకరిస్తారు. గుంజపడుగులో గుంజపడుగు, అగ్గిమల్ల, తిర్మలాపూర్, రంగధా మునిపల్లెకి చెందిన 4 సర్పంచ్ 35 వార్డు స్థానా లు, చిల్లకోడూర్‌లో చిల్వకోడూర్, అబ్బాపూర్, లక్ష్మీపూర్, బీంరాజ్‌పల్లి 4 సర్పంచ్ స్థానాలు, 36 వార్డు స్థానాలు, చందోళిలో చందోళి, దమ్మన్న పేట, ఆత్మకూర్, దట్నూర్‌కు 4 గ్రామ పంచాయ తీ సర్పంచ్, 36 వార్డు స్థానాలు, ఇబ్రహీంనగ ర్‌లో ఇబ్రహీంనగర్, బీబీరాజ్‌పల్లి, రాఘవప ట్నం, గంగాదేవిపల్లెకు సంబంధించి 4 సర్పంచ్ స్థానాలు, 36 వార్డు స్థానాలు, తిర్మలాపూర్‌లో తిర్మలాపూర్, వెంగళాపూర్, నందిపల్లె, శంకర్రా వుపేటకు సంబంధించి 4 సర్పంచ్ స్థానాలు, 32 వార్డు స్థానాలు, వెన్గుమట్లలో వెన్గుమట్ల, బోం కూర్, లొత్తునూర్‌లో 3 సర్పంచ్, 28 వార్డు స్థానాలకు, రాపల్లిలో రాపల్లి, ఇస్రాజ్‌పల్లిలో 2 సర్పంచ్ స్థానాలకు, 20 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.

రూరల్ మండలంలో.. 11 క్లస్టర్లు..
జగిత్యాల రూరల్ మండలంలో నర్సింగాపూర్ క్లస్టర్‌లో నర్సింగాపూర్, వంజరిపల్లె, వెల్దుర్తి, గొల్లపల్లికి చెందిన 4 సర్పంచ్ స్థానాల్లో 34 వార్డు స్థానాలకు, మోరపల్లిలో తాటిపెల్లి, మోరపల్లికి చెందిన 2 సర్పంచ్, 24 వార్డు స్థానాలు, అంత ర్గాం క్లస్టర్‌లో అంతర్గాం, వడ్డెర కాలనీకి సంబం ధించి 2 సర్పంచ్ 18 వార్డు స్థానాలకు, చల్‌గల్ క్లస్టర్లలో చల్‌గల్, చర్లపల్లి సర్పంచ్ స్థానాలు 2, 18 వార్డు స్థానాలు, పోరండ్లలో కన్నాపూర్, పోరండ్ల, బాలపెల్లికి చెందిన 3 సర్పంచ్ స్థానాలు, 26 వార్డు స్థానాలు, కండ్లపెల్లిలో హైదర్‌పల్లి, కం డ్లపెల్లి, హన్మాజిపేట సర్పంచ్ 3 స్థానాలకు, 20 వార్డు స్థానాలు, లక్ష్మీపూర్‌లో లక్ష్మీపూర్, తిమ్మా పూర్ సర్పంచ్ 2 స్థానాలకు, 20 వార్డు స్థానాలు, ధర్మారం క్లస్టర్‌లో ధర్మారం, జాబి తాపూర్ సర్పం చ్ 2 స్థానాలకు, 20 వార్డు స్థానాల కు కల్లెడ క్లస్టర్ లో కల్లెడ, సోమన్‌పల్లి, సంగంపల్లి, హబ్సీ పూర్‌లకు చెందిన 4 సర్పంచ్ స్థానాలకు, 38 వార్డు, పొలాస క్లస్టర్‌లో 1 సర్పంచ్, 14 వార్డు, తక్కళ్ళపల్లిలో తక్కళ్లపల్లి, గు ల్లపేట, గుట్రాజ్‌పల్లి, అనంతారంలో 4 సర్పంచ్ స్థానాలకు, 36 వార్డు స్థానాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు.

జగిత్యాల అర్బన్ మండలంలో 3 క్లస్టర్లు
జగిత్యాల అర్బన్ మండలంలో మోతె క్లస్టర్‌లో మోతె సర్పంచ్ పదవి స్థానంతో పాటు 12 వార్డు స్థానాలు, తిప్పన్నపేట క్లస్టర్‌లో తిప్పన్నపేట స ర్పంచ్, 10 వార్డు, ధరూర్ క్లస్టర్‌లో ధ రూర్, హస్నాబాద్, అంబారిపేటలకు చెందిన సర్పంచ్ , 28 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.

మల్యాల మండలంలో 5 క్లస్టర్లు
మల్యాల మండలంలోని రాంపూర్ క్లస్టర్‌లో రాంపూర్, ఓబులాపూర్, మద్దుట్ల, గొర్రెగుండం, గొల్లపల్లికి చెందిన 5 సర్పంచ్ స్థానాలు, 42 వార్డు స్థానాలు, రామన్నపేటలో రామన్నపేట, నూక పల్లి, పోతారం, రాజారంకు సంబంధించిన 4 సర్పంచ్ స్థానాలు, 40 వార్డు స్థానాలు, తాటిపెల్లి క్లస్టర్‌లో తాటిపెల్లి, సర్వాపూర్, బల్వంతాపూర్ గ్రామాలకు చెందిన 4 సర్పంచ్, 30 వార్డు, మ ల్యాలలో మల్యాల, గుడిపేట, ముత్యంపేటకు చెందిన 3 సర్పంచ్, 34 వార్డు, తక్కళ్ళపెల్లిలో తక్కళ్లపెల్లి, లంబాడిపల్లి, మ్యాడంపల్లి, మానా లకు చెందిన 4 సర్పంచ్ స్థానాలు, 40 వార్డు స్థానాలకు నామినే షన్లు స్వీకరిస్తారు.

పెగడపల్లి మండంలో 8 క్లస్టర్లు
పెగడపల్లి మండలంలో పెగడపల్లి క్లస్టర్‌లో పె గడపల్లి, వెంగళాయిపేట, ఏడుమోటలపల్లికి చెం దిన 3 సర్పంచ్ స్థానాలు, 30 వార్డు స్థానాలు, నందగిరి క్టస్టర్‌లో ఐతుపల్లి, నందగిరి సర్పంచ్ స్థానాలు, 20 వార్డు స్థానాలు, నామాపూర్‌లో నా మాపూర్, మ్యాకవెంకయపల్లె, నర్సింహునిపేట, కీచులాటపల్లిలో 4 సర్పంచ్ స్థానాలకు, 34 వార్డు స్థానాలు, ఎల్లాపూర్ క్లస్టర్ పరిధిలో ఎల్లాపూర్, రామబద్రునిపల్లి, రాజారాంపల్లి, ల్యాగలపల్లికి చెందిన 4 సర్పంచ్ స్థానాలకు, 32 వార్డు స్థానా లకు, ఆరవెల్లిలో ఆరవెల్లి, మద్దులపల్లి, దోమల కుంట 3 సర్పంచ్ స్థానాలకు, 30 వార్డు స్థానాలు, నంచర్ల క్లస్టర్‌లో నంచర్ల, దేవకొండ, రాములపల్లి 3 సర్పంచ్ స్థానాలకు, 28 వార్డు స్థానాలకు, బతికెపల్లిలో బతికెపల్లి, సుద్దపల్లికి చెందిన 2 సర్పంచ్, 24 వార్డు స్థానాలకు, లింగాపూర్‌లో లింగాపూర్, శాలపల్లికి చెందిన 2 సర్పంచ్, 18 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.

కొడిమ్యాల మండలంలో 6 క్లస్టర్లు
కొడిమ్యాల మండలంలో తిర్మలాపూర్ క్లస్టర్ల లో గంగారాం తండా, సూరంపేట, కోనాపూర్, తిర్మలాపూర్, దమ్మయ్యపేటకు చెందిన 5 స ర్పం చ్ స్థానాలు, 42 వార్డు, నాచుపల్లి క్లస్టర్‌లో నా చుపల్లి, డబ్బుతిమ్మాయపల్లి, రాం సాగర్, హిమ్మ త్‌రావుపేట, శనివారంపేటకు చెంది న 5 సర్పంచ్ స్థానాలు, 42 వార్డు, కొడి మ్యాల క్లస్టర్‌లో కొడి మ్యాల, కొండాపూర్, రామ కిష్టాపూర్, చింతలప ల్లికి చెందిన 4 సర్పంచ్ స్థానా లు, 40 వార్డు, చెప్యాల క్లస్టర్‌లో చెప్యాల, నల్లగొండ, తిప్పాయి పల్లికి చెందిన 3 సర్పంచ్ స్థానాలు, 32 వార్డు, నమిలకొండ క్లస్టర్‌లో నమిలకొండ, తుర్కకాశీన గర్, శ్రీరాములపల్లిలో 3 సర్పంచ్ స్థానాలు, 26 వార్డు, పూడూరు క్లస్టర్‌లో పూడురు, అప్పారా వుపేట, గౌ రాపూర్, నర్సింహులపల్లెకు చెందిన 4 సర్పంచ్, 34 వార్డు నామినేషన్లు స్వీకరిస్తారు.

2, 882 మంది ఉద్యోగులు
మూడో విడత ఎన్నికలు జనవరి 30న నిర్వహిం చేందుకు 2,882 మంది ఉద్యోగులను నియమించారు. ఇందులో మల్యాల మండలం లో 186 మంది పీఓలు, 240 ఓపీఓలు, కొడిమ్యాలకు 216మంది పీఓలు, 288 మంది ఓపీఓలు, జగిత్యాల రూరల్‌లో 268 మంది పీఓలు, 338మంది ఓపీఓలు, జగిత్యాల అర్బన్ లో 50 మంది పీఓలు, 61మంది ఓపీఓలు, గొల్లపల్లిలో 246 మంది పీఓలు, 289 మంది ఓపీఓలు, పెగడపల్లిలో 216 మంది పీఓలు, 258 మంది ఓపీఓలను నియమించారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles