కమనీయం గోదారంగనాథుల కల్యాణం

Tue,January 15, 2019 05:25 AM

మారుతీనగర్ : మెట్‌పల్లి మండలంలోని వేంపేట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో సోమవారం వేదపండితులు చక్రపాణి వా మనాచార్యా గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువ గా నిర్వహించారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్వామివారి కల్యాణంలో పాల్గొని పట్టు వస్ర్తాలను సమర్పించీ, ప్రత్యేక పూజలు చేశారు. హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగించారు. కాగా, భక్తులు స్వామివారికి కట్నకానుకలు అందజేసి ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ వేదపండితులు చక్రపాణి కిరణ్‌కుమార్, బీర్నంది భానుమూర్తి, నర్సింహచార్య, జయవర్దనచారి, విష్ణువర్థనాచారి, ప్రజాప్రతినిధులు, ఆలయాభివృద్ధి కమిటీ సభ్యు లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి టౌన్: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొ గోదారంగనాథుల కల్యాణోత్సవాన్ని సోమవారం పట్టణం లోని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ నివాసంలో అంగరం గ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు గోదాదేవి, రంగనాథుల కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. మెన్నేని శ్యామల, వేముల తార, లక్ష్మి, రమ, సత్యవతి, కిరణ్ రావు, ప్రభాకర్, నర్సింగరావు, నాగరాజు, వెంకటేశ్, శ్రీనివాస్, వసంత్‌నాయక్ పాల్గొన్నారు.

సారంగాపూర్: మండలంలోని రేచపల్లిలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి, జగన్నాథ స్వాముల కల్యాణాన్ని అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదాదేవి కల్యాణంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ కోదండరామాలయం, సోమవారం ఘనంగా గోదాదేవి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు వేణుగోపాలచార్య కౌశిక, విజ్జన్న, చైర్మన్ గౌరిశెట్టి హరీశ్, అర్చకులు అరుట్ల పూర్ణచంద్రాచార్యులు, భరతేశ్వర్, సురేశ్ రెడ్డి, కే రాజేశ్వర్ రావు, ప్రభాకర్, ఎం సమ్మయ్య, జితేందర్ యాదవ్, ఆర్ పరమేశ్వర్, భారతి, సత్యనారాయణ, మహేందర్ పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles