కల్యాణం.. కమనీయం..


Mon,January 14, 2019 04:02 AM

-కొండగట్టు, ధర్మపురి, కోరుట్లలో వైభవంగా గోదా కల్యాణం
-గోదారంగనాథులకు ప్రత్యేక పూజలు
-పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
మల్యాల : కొండగట్టు అంజన్న సన్నిధానంలో గోదారంగనాథుల కల్యాణం వేద మంత్రోచ్ఛరణల మధ్య కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా అంజన్న ఆలయంలో గోదారంగనాథుల కల్యాణాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుంచే స్వామి వారికి ఆరాధన, జలాభిషేకం, పంచామృతాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను ముస్తాబు చేసి మేళతాళాలతో కల్యాన వేదికపైకి తీసుకువచ్చి అంగరంగ వైభవంగా కల్యానం జరిపారు. స్వామి వారి వస్ర్తాలను ఆలయ ఈవో అమరేందర్ దంపతులు అందజేశారు. నెల రోజులుగా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా గోదాదేవికి అలంకరణ చేయడంతో పాటు పాసురాల అనుసంధానం, పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం రంగనాథుల స్వామి వారితో కల్యాణం నిర్వహించడంతో ధనుర్మాసం ఉత్సవాలు ముగిశాయి. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ఆలయ ఈవో పరంకుశం అమరేందర్ దంపతులు, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఆంజనేయులు, శ్రీనివాస్ శర్మ, ఆలయ ఇన్ జెమిని శ్రీనివాస్, సునిల్ గౌడ్, ఆలయ స్థానాచార్యులు జితేంద్ర ప్రసాద్, ప్రధానార్చకులు రామకృష్ణ, మారుతి, ఉప ప్రధానార్చకులు చిరంజీవి, అర్చకులు లక్ష్మణ్, పవన్, శ్రీకాంత్, తదితరులున్నారు.


ధర్మపురి,నమస్తేతెలంగాణ: ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆల య ఆవరణలోని శేషప్ప కళావేదికపై ఆదివారం గోదారంగనాథుల కల్యాణోత్సం వైభవంగా జరిగింది. వేద పండితులు బొజ్జ రమేశ్ శర్మ, పండితులు ముత్యాల శర్మ నేతృత్వంలో ఆలయ అభిషేక్ పురోహితులు సంపత్ కుమార్ వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఆదివారం సంక్రాంతి సెలవులు రావడంతో ధర్మపురి క్షేత్రం భక్తుల రద్దీ పెరిగింది. దేవస్థానం ధర్మకర్తలు ఈ వెంకటేశ్వర్ ఏ సునీల్ దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ తదితరులు ఉన్నారు.

కోరుట్లటౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం గోదారంగనాథుల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు బీర్నంది నర్సింహచారి నేతృత్వంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి, వేద మంత్రోచ్ఛరణల మధ్య వివాహం జరిపించారు. వేడుకలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు చిన్నారులు చేసిన నృత్యరూపకాలు అలరించాయి. అలాగే వేంకటేశ్వర భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు పాలెపు రాముశర్మ, మున్సిపల్ అధ్యక్షుడు శీలం వేణుగోపాల్, జయలక్ష్మి దంపతులు, ఈవో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ పెడిపల్లి నరసయ్య, కౌన్సిల్ సభ్యులు యాటం కరుణాకర్, బట్టు సునీల్, టీఆర్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, పోగుల లక్ష్మీరాజం, ఆడెపు మధు, భజన మండలి సభ్యులు తనుగుల రాజశేఖర్, బొమ్మ రాజేశం, కొటగిరి నరేశ్, బీమానాతి రవికుమార్, గోడికే రాములు, చింతకింది దామోదర్, కృష్ణ, రవి, శ్రీ రాం, తుమ్మనపల్లి వేణుగోపాల్, అర్చకులు పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని అష్టలక్ష్మీ ఆలయంలో ధను ర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోదారంగనాథుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. జగిత్యాల శాసనస భ్యుడు డాక్టర్ సంజ య్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహ కులు గరిపెల్లి శంకర్, శమంత, రాంచంద్రం, ప్రభాకర్, గంప వేణు, రాచకొండ రజిత, గంగాధర్, విశ్వేశ్వర్, వెంకటరమణ పాల్గొన్నారు.

92

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles