ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 25 లక్షల నజరాన


Mon,January 14, 2019 01:30 AM

కథలాపూర్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకం రూ. 10 లక్షలు, అదనంగా ఎమ్మెల్యే కోటానుంచి రూ. 15 లక్షలు కలిపి రూ. 25 లక్షలు ప్రోత్సహకంగా నిధులు ఇస్తామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం కథలాపూర్ మండలకేంద్రంలో టీఆర్ కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. గ్రామాల్లోని ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంతో టీఆర్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు చేసిందన్నారు. కొత్తచట్టంలో ప్రజలకు పాలకులు జవాబుదారితనంగా ఉండేలా ఉందన్నారు. సర్పంచ్ పాటు ఉపసర్పంచ్ చెక్ అధికారం, హరితహారం కార్యక్రమం నిరంతర ప్రక్రియగా మార్చిన ఘనత టీఆర్ ప్రభుత్వానిదన్నారు. మూడు నెలల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఎస్సారెస్పీ వరదకాలువ నుంచి లిఫ్ట్ ద్వారా అన్ని గ్రామాల్లోని చెరువులను నింపుతామన్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలి చి తొలిసారిగా కథలాపూర్ వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేకు, మార్క్ చైర్మన్లకు కథలాపూర్ గం గపుత్ర సంఘం నాయకులు, మండల టీఆర్ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కా ర్యక్రమంలో మార్క్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్ పొలాస నరేందర్, మం డల నాయకులు వర్ధినేని నాగేశ్వర్ మామిడిపెల్లి రవి, చీటి విద్యాసాగర్ కల్లెడ శంకర్, నాంపెల్లి లింబాద్రి, సబ్బని గంగు, దొప్పల జలేందర్, చెల్లపెల్లి అంజయ్య, కేతిరెడ్డి మహిపాల్ తిరుపతిరెడ్డి, రాయికంటి శేఖర్, శ్రీరాముల ప్రకాశ్, ఎల్లాల కిషన్ రిక్కల సంజీవ్ మామిడి నారాయణరెడ్డి, కనగందుల గంగాధర్, మేడిపెల్లి సాయిరెడ్డి, ఆదిరెడ్డి, బొర్రన్న, రాపెల్లి గంగారాం, సోమ దేవేందర్ అందె స్వాగత్ పొలాస దేవయ్య, శనిగారపు గణేశ్, బొమ్మెన గంగారాం, మంతెన గోవర్ధన్, చంద్రునాయక్, మేగ్యానాయక్, నల్ల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

94

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles