గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలకం


Mon,January 14, 2019 01:29 AM

మేడిపల్లి : గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలకమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలోని పీఎన్ గార్డెన్ టీఆర్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మార్క్ చైర్మన్ లోక బాపురెడ్డి, వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం నుంచి వరదకాలువలోకి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు పంపింగ్ చేయడంతో మేడిపల్లి, కతులాపూర్ మండలాలు సస్యశ్యామలమవుతాయని పేర్కొన్నారు. టీఆర్ పార్టీ నుంచి ఇద్దరు సర్పంచ్ పదవికి నామినేషన్ వేసినచో గ్రామానికి చెందిన పార్టీ నాయకులు అందరు కూర్చోని ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరు నామినేషన్ విరమించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్ పార్టీ అధికారంలో ఉందనీ, సర్పంచ్ టీఆర్ పార్టీకి చెందినవారైనచో గ్రా మం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. టీఆర్ పార్టీకి చెందిన వారిని సర్పంచ్ గెలుపించుటకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం క్యాతం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మందికి ఎమ్మెల్యే రమేశ్ బాబు టీఆర్ పార్టీ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ పార్టీ మండలాధ్యక్షుడు సుధవేని గంగాధర్, సింగిల్ చైర్మన్ మిట్టపెల్లి భూమారెడ్డి, నాయకులు కాటిపెల్లి శ్రీపాల్ పోలాస నరేందర్, ముక్కెర గంగాధర్, సుధవేని భూమేశ్ గౌడ్, మకిలి దాస్, నల్ల మహిపాల్ అంకం సాగర్, గాజిపాషా, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

81

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles