ప్రజా సంక్షేమమే ధ్యేయం

Mon,January 14, 2019 01:29 AM

జగిత్యాల రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల, మతాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల మండలంలోని తారకరామానగర్ అరబ్బి స్కూల్ (మదర్ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రంలోని అన్ని కుల మతాల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గంగా, జమున తహజీబ్ ప్రజలు జీవిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కొంతమంది మత ఘర్షణలు జరుగుతాయని లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. సీఎం కేసీఆర్ రా ష్ట్రంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పలు సంస్కరణలు చేశారని తెలిపారు. మైనార్టీ గురుకుల విద్యాలయాలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మైనార్టీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ద్వారా రూ.20లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారన్నారు. జగిత్యాల నియోజక వర్గంలోని మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజ్ పింఛన్లు అందజేయడంతో పాటు రంజాన్ మాసంలో ముస్లిం పేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ చే యడం జరుగుతుందన్నారు. అనంతరం అరబ్బి కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అరబ్బి స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ అఖిలొద్దీన్, మత గురువులు మౌలా నా, పీఎం, ముజాలమి సాబ్, హస్మి, మౌలానా, ముసాదిక్ ఉర్దూ అకాడమి హైదరాబాద్, మజర్ ఖాసీం, ఉమర్ అలీ బేగ్, చాంద్ పాషా, ఫిరోజ్, జమీల్, రాజు, సురేశ్, కృష్ణ కొండ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles