సారంగాపూర్ 3, బీర్ 1


Mon,January 14, 2019 01:29 AM

సారంగాపూర్ : సారంగాపూర్, బీర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నాలుగు గ్రామ పంచాయతీల ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవమయ్యాయి. సారంగాపూ ర్ మండలంలోని మ్యాడారం తండా, భీంరెడ్డి గూడెం, ఒడ్డెరకాలనీ, బీర్ మండలంలోని కందెనకుంట గ్రామాల్లో ప్రజలు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కావాలని నిర్ణయించుకొని బరిలో ఒక్కొక్కరినే నిలపడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వేణు, భీమయ్యలు అభ్యర్థులకు గెలుపు ధృవీకరణ పత్రాలను అందజేశారు. బీర్ మండలంలోని కందెనకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆసునూరి భీమక్క, ఉప సర్పంచ్ ఏదుల లావణ్య, వార్డు సభ్యులుగా కొమిరె నర్సయ్య, మార్నేని కమల, సిరిపెల్లి రాజేందర్, బద్ది పద్మ, కుర్రి లక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సారంగాపూర్ మండలంలోని వడ్డెర కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పల్లపు వెంకటేశ్, ఉప సర్పంచ్ పోగుల మా ధవి, వార్డు సభ్యులుగా పోగుల మధవి, చెర్ల నర్సమ్మ, పల్లపు కళ్యాణ్, బోదాసు రాజమ్మ, దండుగుల పెద్ద నర్సింగ్, పల్లపు బాపిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. మ్యాడారం తండాలో సర్పంచ్ భూక్య అరుణ్ కుమార్ పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. భీంరెడ్డి గూడెంలో సర్పంచ్ మైనవేని బుచ్చిమల్లు, ఉప సర్పంచ్ గుడిపెల్లి పుషన్న, వార్డ్ సభ్యులుగా కర్నాటకపు శ్రీను, కర్నాటకపు లక్ష్మి, కర్నాటకపు వెంకటవ్వలు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. రిటర్నిం గ్ అధికారులు గెలుపొందిన అభ్యర్థులకు ధృవీకరణ ప త్రాలు అందజేశా రు.
సూరారం సర్పంచ్, ఉపసర్పంచ్ ఏకగ్రీవం


వెల్గటూరు: వెల్గటూరు మండలంలోని సూరారం సర్పంచ్ బండారి లచ్చయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్ కొంగల సత్యనారాయణరెడ్డిని వార్డు సభ్యులందరు కలిసి ఎన్నుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బత్తుల భూమయ్య తెలిపారు. కాగా సూరారం సర్పంచ్ స్థానం ఎస్సీ జనర్ కేటాయించారు. ఇక్కడ సర్పంచ్ నాలుగు నామినేషన్లు వచ్చాయి. అందులో జాడి లక్ష్మిరాజం, బండారి చరణరాజ్, అంతర్పుల కుమార్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీనితో బండారి లచ్చయ్య స ర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కాగా ఆరు వా ర్డులకు 16 మంది నామినేషన్లు వేయగా 10 మంది ఉప సంహరించుకోవడంతో ఆరు వార్డులు కొడిపెల్లి సత్తమ్మ (1వ వార్డు), గందం శ్రీనివాస్ (2వ వార్డు), కొంగల సత్యనారాయణరెడ్డి (3వ వార్డు), చె ల్పూరి మల్లయ్య (4వ వార్డు), చెల్పూరి తార (5వ వార్డు), ఈదుల భాగ్యలక్ష్మి (6వ వార్డు) ఏకగ్రీవమయ్యాయి.

81

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles