సొంత నిర్ణయాలు వద్దు


Sun,January 13, 2019 01:00 AM

-నిబంధనలకు లోబడే అధికారులు వ్యవహరించాలి
-ఎలాంటి సమస్య ఉన్నా ఉన్నతాధికారులను సంప్రదించాలి
-పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
-ధర్మపురిలో పీవో, ఏపీవోల శిక్షణ తరగతుల తనిఖీ
-కలెక్టర్ చాంబర్ సమీక్ష
జగిత్యాల ప్రతినిధి/ధర్మపురి, నమస్తే తెలంగాణ: ఎన్నికల్లో సిబ్బంది, అధికారులు సొంత నిర్ణయా లు తీసుకోవద్దనీ, ఈసీ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే వ్యవహరించాలనీ, ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ నాగిరెడ్డి సూచించారు. ధర్మపురి న్యూ టీటీడీ క ల్యాణ మండపంలో ధర్మపురి, బుగ్గారం మండలాల ఎన్నికలపై నిర్వహించిన పీవో, ఏపీవోల శిక్ష ణ కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మతో కలిసి పరిశీలించారు. ఎన్నికలు సజావుగా, రీపోలింగ్ లేకుండా ఉండాలంటే పీవో లు, ఏపీవోలు మంచి శిక్షణ పొందాలన్నారు. ఎ న్నికల విధులపై ప్రతి ఒక్కక్కరినీ ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుందనీ, తర్వాత 2గంటల నుంచి కౌం టింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటించే దాకా అధికారులు అక్కడే ఉండాలనీ, 5వేల వరకు ఓటర్లున్న గ్రామాల్లో రాత్రిదాకా ఓట్ల లెక్కింపు ఉం టుం టదని ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సెలవు దినాల్లో కూడా అధికారులు శిక్షణకు రావడం అభినందనీయమని కమిషనర్ ప్రశంసించారు.


ప్రతి రూపాయీ జమచేయాలి
అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో నాగిరెడ్డికి కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వా గతం పలికిన అనంతరం కలెక్టర్ ఛాంబర్ ఆ యన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు లు ప్రచారం కోసం వెచ్చించే ప్రతి రూపాయినీ అ భ్యర్థుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలన్నారు. ఇందుకు వ్యయ నమోదు, శాడో రిజిస్టర్ నిర్వహించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం, ఇత ర ఖర్చులు అధికంగా చేసే అవకాశం ఉన్న దృష్ట్యా ఎన్నికల అకౌంటింగ్, వీడియో సర్వేలైన్స్, ఫ్లయిం గ్ స్కాడ్, స్టాటిస్టికల్ సర్వేలైన్స్, ఎంసీఎంసీ బృందాలు అత్యంత క్రమశిక్షణగా పనిచేయాలన్నారు. వ్యయ పరిశీలకులు, సహాయ వ్యయ పరిశీలకులు, ఎంపీడీవోలు ప్రచార ఖర్చులను లెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో ఏకగ్రీవాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలిం గ్ కేంద్రాల వద్ద బందోబస్తు పెంచాలన్నారు.

అన్ని ఏర్పాట్లూ చేశాం : కలెక్టర్ శరత్
కలెక్టర్ శరత్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లూ చేశామని ఎన్నికల కమిషనర్ వివరించా రు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తున్నామనీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎం పీడీవోలు సాధ్యమైనంత ఎక్కువ సార్లు గ్రామాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారనీ, ప్రతి మండలానికీ అనుభవం కలిగిన జిల్లాస్థాయి అధికారిని నియమించామని చెప్పారు. జిల్లాలో 380 పంచాయతీలు, 3500వార్డులుండగా, 1538సాధారణ, 1208సున్నితమైన, 512అతి సున్నితమై న, 242 సమస్యాత్మక వార్డులను గుర్తించామని తెలిపారు. కొత సిబ్బందికి గతంలో బ్యాలెట్ బాక్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనుభ వం ఉందనీ, వారు కూడా ప్రస్తుత శిక్షణల్లో ఉన్నారనీ, వారితో పాటు బ్యాలెట్ బాక్స్ ద్వారా ఇదివరకు ఎన్నికల విధులు నిర్వహించని సిబ్బందికి ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చామనీ, మరోసారీ శిక్షణ ఇస్తామని తెలిపారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

80

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles