లక్ష్యం దాటుతాం

Sun,January 13, 2019 12:58 AM

-జిల్లాలో శనివారం వరకు 5లక్షలమందికి కంటి పరీక్షలు
-60వేల మందికి కళ్లద్దాల పంపిణీ
-10,200మందికి ఆపరేషన్ అవసరమని గుర్తింపు
-282గ్రామాల్లో శిబిరాలు పూర్తి..
- మార్చి 3దాకా కార్యక్రమం
-జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పుప్పాల శ్రీధర్
-పెగడపల్లిలో కంటి వైద్య శిబిరం పరిశీలన
పెగడపల్లి : జిల్లాలో కంటి పరీక్షల నిర్వహణలో లక్ష్యానికి మిచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పుప్పాల శ్రీధర్ పే ర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ శ్రీధర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో సుమారు 10 లక్షల జనాభా ఉండగా, ప్రభుత్వం 7లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, శనివారం వరకు 5లక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. లక్ష్యానికి మించి కంటి పరీక్షలు నిర్వహిస్తామనీ, జిల్లాలోని 282 గ్రామాలకు గానూ 218 గ్రా మాలు, జగిత్యాల, కోరుట్ల, మెట్టుపల్లి మున్సిపల్ పరిధిలోని 25 రెవెన్యూ వార్డులకు గానూ 18 వార్డుల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 5లక్షల మందికి పరీక్షలు పూర్తి చేసినట్లు వివరించారు. ఇందులో 60 వేల మంది కి కంటి అ ద్దాలు అందజేయగా, 10వేల 200 మందికి కంటి పరీక్షలకు అర్హులుగా గుర్తించీ, వరుస క్ర మంలో సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కం టి వైద్య శిబిరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా కొనసాగుతున్నాయన్నారు. కంటి అద్దాలకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రభు త్వం గతేడాది ఆగష్టు 15న కంటి వైద్య శిబిరాలను ప్రారంభించగా, మార్చి 3వ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని డీ ఎంహెచ్ శ్రీధర్ సూచించారు. మండల వైద్య, ఆరోగ్య అధికారి ప్రణ వ్, వైద్య సిబ్బంది జాల శ్రీకాంత్ సంతోష్, రేణుక, రాజశ్రీ, శంకరమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles