పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటాలి

Sun,January 13, 2019 12:57 AM

-ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించండి
-జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
సారంగాపూర్ : రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ అభ్యర్థులు సత్తాచాటాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారుఅన్నారు. శనివారం బీర్ మండలంలోని రంగసాగర్, చిత్రవేణి గూడెం, రేకులపల్లి, తాళ్లధర్మరం, మంగెళ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా గ్రామాల్లోకి ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ మొదటి సారి రావడంతో నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రా మాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులను కలిసి ఎన్నికల పరిస్థితులను అగిడి తెల్సుకున్నారు. ఎన్నికల్లో టీఆర్ అభ్యర్థులు సత్తా చాటాలని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు అవగాహన కల్పించాలని సూచించారు. ఎంపీపీ కొల్ముల శారద, సింగిల్ విండో చైర్మెన్లు ముప్పాల రాంచందర్ రావు, మెరుగు రాజేశం, నాయకులు కొల్ముల రమణ, ముక్క శంకర్, గంగధరి సంతోష్ గౌడ్, ఆయా గ్రామాల తాజామాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, నాయకులున్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles