అలిశెట్టి కవిత్వం అజరామరం


Sun,January 13, 2019 12:57 AM

-స్వరాష్ట్రంలో ఆయనకు గొప్ప గౌరవం
-జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
-పలువురు కవయిత్రులకు స్మారక పురస్కారాల ప్రదానం
జగిత్యాల, నమస్తే తెలంగాణ : అలిశెట్టి కవిత్వం అజరామరనీ, చిన్న కవితల్లో గొప్ప భావాన్ని వ్యక్తీకరించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో అలిశెట్టి జయంతి, వర్ధంతిని కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్స్ గుండేటి రాజు ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ భవన్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల వాసి అయినందుకు గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాహిత్యాభిమాని అవడంతో పాటు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అలిశెట్టికి గొప్ప గౌరవం లభించిందన్నారు. ఆయన కవితలు పదో తరగతి పాఠ్యపుస్తకాలల్లో చోటు దక్కిందన్నారు. దీంతో ఆయ న కవితలను చదివే అవకాశం భవిష్యత్ తరాలకూ దక్కిందన్నారు. సమాజంలోని అసమానతలను అలిశెట్టి తన కవితలతో విమర్శించారని చెప్పారు. దురదృష్టవశాత్తు చిన్న వయస్సులోనే పరమపదించారని, ఆయన పుట్టిన రోజు.. మృతి చెందిన రోజు ఒకే కావడం యాధృచ్చికమన్నారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ ‘రాజు మరణించి ఒక తార రాలిపోయే’ అని జాషువా కవితను ఉదహరించి, మంచి కవులు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని, అలాంటి వారిలో అలిశెట్టి ఒకరని కొనియాడారు. ఈ సందర్భంగా అలిశెట్టి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కవయిత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్నప్రభకు ప్రదానం చేశా రు. అలాగే మహిళా సాహిత్య పురస్కారాలను కవులు చిందం సునీత, దాసరి శాంతకుమారి, కొలిపాక శోభారాణి, చీకట్ల సంగీతకు అందజేశారు. అంతకు ముందు అలిశెట్టి చిత్రపటానికి ఎమ్మెల్యే సంజయ్, అడ్మిన్ ఎస్పీ మురళీధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రేగొండ నరేశ్, అలిశెట్టి రాజు, మాడిశెట్టి గోపాల్, అతిథులుగా డీఎస్పీ ప్రతాప్, పెద్ది ఆనందం, టీవీ సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, స్వాతంత్య్ర సమరయోధులు రాఘవేంద్రరావు, పీపీ శ్రీనివాస్ గౌడ్, ఎల్లాల రాజేందర్ గాజుల రాజేందర్, బండ శంకర్, డాక్టర్ రాజగోపాలచారి, అలిశెట్టి ఈశ్వరయ్య, ఎల్ల గంగా రాం పాల్గొన్నారు.

147

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles