ట్రా‘ఫికర్’ నివారణకే ఈ-చలాన్

Sat,January 12, 2019 01:14 AM

-కొత్త విధానంతో ప్రమాదాలు సైతం తగ్గుముఖం
-ప్రతి వాహనదారూ నిబంధనలు పాటించాలి
-జగిత్యాలను ట్రాఫిక్ సమస్య రహిత జిల్లాగా మార్చాలి కలెక్టర్ శరత్
-ఇక అతిక్రమణదారు ఇంటికే జరిమానా నోటీసులు147రకాల నేరాలకు ‘ఈ-చలాన్’
-సాంకేతికతను పారదర్శకంగా వినియోగిస్తాం ఎస్పీ సింధూ శర్మ
-జిల్లాలో నూతన విధానం ప్రారంభం
జగిత్యాల క్రైం : ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ-చలాన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ శరత్ అన్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మతో కలిసి స్థానిక ఏఎంఏ హాలులో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో లా అండ్ ఆర్డర్ సక్రమం ఉందనీ, ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తుండటానికి కారణం పోలీసుల కృషేనన్నారు. హైదరాబాద్ అమవుతున్న ఈ చలాన్ విధానన్నీ జిల్లాలోనూ ప్రారంభించడం అభినందనీయమన్నారు. దీంతో ట్రాఫిక్ వ్యవస్థ మెరుగవుతుందనీ, నిబంధనలు విరుద్ధంగా ప్రవర్తిస్తే జరిమానా నోటీసు నేరుగా ఇంటికే పంపించే విధానంతో అతిక్రమణలు తగ్గే అవకాశం ఉందన్నారు. వాహనదారులు తమవంతు బాధ్యతగా నియమావళిని పాటించాలని కోరారు. ఈ-చలాన్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేసి జిల్లాను ట్రాఫిక్ సమస్య రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. అలాగే ఏ ఉద్దేశంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారో ప్రజలకు అర్థమయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలనీ, ఏ అతిక్రమణకు జరిమానా, శిక్ష ఎంత ఉంటుందో కరపత్రాలు, బ్రోచర్ల ద్వారా ప్రచారం చేయాలన్నారు.

హైదరాబాద్ తరహాలో : ఎస్పీ
గ్రేటర్ హైదరాబాద్ తరహాలో జిల్లాలోనూ ఈ చలాన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. ట్రాఫిక్ అతిక్రమణలు, ట్రాఫిక్ ఇబ్బందులు, సిబ్బంది సమస్యలకు త పరిష్కారమే ఈ-చలాన్ అన్నారు. జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణే పోలీసుల ఉద్దేశమని, వాహదారులకు జరిమానాలు విధించడం కాదని చెప్పా రు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్ పాటు నిబంధనలు అతిక్రమించే వాహనదారుల కు ఇంటికే చలాన్ పంపించి, ఏడు రోజుల్లో గేట్ పేమెంట్ విధానం ద్వారా వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. చలాన్ చెల్లించకుంటే సదరు వాహనదారుడిపై చార్జిషీట్ దాఖలు చేస్తామనీ, ఒక వాహనదారుడికి మూడు చలాన్ జారీ అయిన పక్షంలో లైసెన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపారు. 147 రకాల ట్రాఫిక్ అతిక్రమణలకు ఈ-చలాన్ వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ విధానంతో పారదర్శకత ఉంటుందనీ, పోలీసుల ప్రతిష్ట సైతం పెరుగుతుందన్నారు. జరిమానాలు నగదు రహితం చేసేందుకు గేట్-వే పేమెంట్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాలు, ట్యాబ్ స్మార్ట్ ఫోన్ సహాయంతో వీడియో రికార్డింగ్, ఫొటోలు తీసి చలాన్ విధించనున్నట్లు చెప్పారు. వాహనాల వేగాన్ని గుర్తించేందుకు త్వరలో జిల్లాలో స్పీడ్ గన్స్ అమర్చనున్నట్లు చెప్పారు. వాహనదారులకు జారీ చేసిన ఈ-చలాన్ వివరాలను www.echallan. org ద్వారా తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలోని ప్ర తి పోలీస్ అధికారికి ట్యాబ్ అందిస్తామని, వీటి సహాయంతో చలాన్, కేసుల నమోదు, ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ట్రాఫిక్ కమాండ్ సెంటర్ ద్వారా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ జి.నరేందర్, డీటీఓ కిషన్ జగిత్యాల అడిషనల్ ఎస్పీ మురళీధర్, డీఎఫ్ నర్సింహరావు, జగిత్యాల, మెట్ డీఎస్పీలు వెంకటరమణ, మల్లారెడ్డి, సీఐలు కె.ప్రకాశ్, రాజేశ్, నాగేందర్, లక్ష్మీబాబు, పోలీస్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles