మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం


Sat,January 12, 2019 01:11 AM

-జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ పేర్కొన్నా రు. జగిత్యాల మున్సిపల్ కా ర్యాలయంలో శుక్రవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి జగిత్యాల ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం మం జూరు చేసిన రూ.50 కోట్ల నిధులతో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్ల అభివృద్ధి, డ్రైన్ల నిర్మాణం చేప్టడంతో పాటు పట్టణ సుందరీకరణలో భాగంగా వీధి దీపాల అమరిక, పార్కుల నిర్మాణం, సీసీ కెమెరాలను అమర్చి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపల్ సాధారణ సమావేశానికి సంబంధిత అధికారులు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని ము న్సిపల్ కమిషనర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా జగిత్యాలకు ఆరు నెలలుగా జగిత్యాలకు సరఫరా అవుతున్న నీటి వినియోగంపై జగిత్యాల మున్సిపాలిటీ చెల్లించాల్సిన రూ. 2.50కోట్లకు సంబంధించిన బిల్లులు మున్సిపాలిటీగా భారంగా మారాయని సభ్యులు ఎమ్మెల్యే దృ ష్టికి తీసుకురాగా, విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యేను అభినందించిన మున్సిపల్ సభ్యులు..
జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత జగిత్యాల మున్సిపాలిటీ సమావేశానికి తొలిసారిగా హాజరైన ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ అద్యక్షురాలు విజయలక్ష్మి, కమిషనర్ సంపత్ అధికారులు, సభ్యులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి శుభాక్షాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కమిషనర్ సంపత్ వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

88

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles