కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

Tue,November 20, 2018 01:03 AM

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: ఎట్టకేలకు తుది జాబితాలో కోరుట్ల టికెట్‌ను జువ్వాడి నర్సింగరావుకు కేటాయించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పా ర్టీలో అసంతృప్తి సెగలు మిన్నంటాయి. టికెట్ కో సం చివరి క్షణం యత్నించిన మాజీ ఎమ్మెల్యే కొ మిరెడ్డి రాములకు మొండి చెయ్యి ఎదురవడంతో ఆయన వర్గీయులు మండి పడుతున్నారు. ప్యారచూటర్లకు టికెట్ ఇవ్వబోమని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం టీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జువ్వాడి నర్సింగరావుకు టికెట్ ఎలా ? ఇస్తారంటూ ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. సో మవారం కొమిరెడ్డి రాములు నివాసానికి భా రీగా తరలివచ్చిన ఆయన మద్దతు దారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీటీడీపీ రా ష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కలిసి రూ.5 కోట్లకు టికెట్‌ను జువ్వాడి నర్సింగరావుకు అమ్ముకున్నారం టూ ఆరోపించారు. తమ నాయకునికి టికెట్ రా కుండా అడ్డుకున్నారంటూ మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ యన నివాసం ఎదుట జాతీయ రహదారిపై దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, కొమిరెడ్డి వర్గీయులకు స్వల్పవాగ్వాదం జరిగింది. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణం లో బైక్ ర్యాలీ తీశారు. కాగా ఆదివారం రాత్రి తుది జాబితాలో టికెట్ ఖరారు కావడంతో సో మవారం జువ్వాడి నర్సింగరావు తన మద్దతు దారులతో పట్టణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్స్ నుం చి టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలు దేరారు. మార్గ మ ధ్యలో కొమిరెడ్డి రాములు ఇంటి సమీపంలో ర హదారి మీదుగా ర్యాలీ వెళ్తుండగా అదే సమయంలో రాములు ఇంటి వద్ద ఉన్న ఆయన మద్ద తు దారులు ఒక్కసారిగా ఎల్ రమణ, జువ్వాడి నర్సింగరావు, మధుయాష్కీగౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు ఏకంగా తమ నా యకుడికి రావల్సిన టికెట్‌ను రాకుండా అమ్ముకున్నారని ఆగ్రహంతో ఎల్ రమణపై చెప్పుతో దా డికి యత్నించారు. ర్యాలీకి ఇవతలి వైపు బస్సు రావడంతో చెప్పు బస్సుపై పడింది. చెప్పులు, రాళ్లు విసిరేందుకు యత్నిస్తున్న క్రమంలో స్థానిక పోలీసులు అప్రమత్తమై ఆందోళన కారులను నివారించే ప్రయత్నం చేశారు. కొద్ది సేపు ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ రవికుమార్, ఎస్‌ఐలు శంకర్‌రావు, పృథ్విధర్, మ హేందర్, రాము నాయక్, పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి జువ్వాడి నర్సింగరావు, ఎల్ రమణలను నామినేషన్ కేంద్రంలోకి పంపించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వా హనాల్లో తిరిగివెళ్లిపోయారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles