అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం

Mon,November 19, 2018 01:07 AM

-జగిత్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్
-జగిత్యాలలో ప్రచారం
జగిత్యాల రూరల్ : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ అన్నా రు. జగిత్యాల పట్టణంలోని 19,26,27 వార్డుల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. కుల వృత్తిదారులకు పెద్దపీఠ వేసేందుకే మత్స్య కారులకు ఉచితంగా చేపపిల్లలు, సబ్సీడీ ద్వారా వాహనాలు, యాదవులకు గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సహకారంలో జగిత్యాల పట్టణానికి 4వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయన్నారు. జగిత్యాల పట్టణాభివృద్ధి కోసం రూ.50కోట్ల నిధులు మం జూరయ్యాయనీ, వీటితో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఆసరా పింఛన్ల పెంపు, బీడీ కార్మికుల పింఛన్లను అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణరావు, బం డారి విజయ్, రాజేష్, చిరంజీవి, గుమ్ముల అంజ య్య, సమిండ్ల శ్రీనివాస్, శంకర్, పవన్, గంగారెడ్డి, మల్లేశం, వ జ్రమ్మ, కంకనాల లింగన్న, బ్ర హ్మాండబేరి నరేశ్, ప్రశాంత్, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
సంజయ్‌కు రూ.10,016 విరాళం
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఎన్నికల ఖర్చు కోసం జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ 20వ వార్డుకు చెందిన ప్యాట మల్లేశం అనే రైతు రూ.10,016ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన మల్లేశంకు అ భ్యర్థి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణ రావు, బండారి విజయ్, కంకనాల లింగం, సమిండ్ల శ్రీనివాస్, ఉప్పు కిషన్, జంగిలి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles