విదేశీ చట్టాలపై అవగాహన ఉండాలి


Sun,November 18, 2018 01:24 AM

జగిత్యాల కలెక్టరేట్ : వలస కార్మికులు విదేశీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ గల్ఫ్ న్యాయవాది అనురాధ సూచించారు. దుబాయిలోని అల్ మంజార్ పార్క్‌లో శనివారం దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవా సమితి ఆధ్వర్యంలో యూఏఈలోని ఏడు రాష్ర్టాల్లోని సేవా సమితి స భ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ న్యాయవాది, లీగల్ అడ్వయిజర్ అనురాధ ఈ సందర్భంగా వలస కార్మికులకు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. ఇక నుంచి గల్ఫ్ కార్మికులకు ఎలాంటి లీగల్ సహాయం కా వాల్సి వచ్చినా అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. అనంతరం వలస కార్మిక సంఘ ప్రతినిధి గుండల్లి నర్సింహులు మాట్లాడుతూ యూఏఈలో వీసా గడువు ముగిసి నివసిస్తున్న తెలుగు వారికి స్వదేశానికి తిరిగి వల్లేందుకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షకు అవకాశం కల్పించిందన్నారు. క్షమాబిక్షను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని స్వగ్రామాలకు తిరిగి వెళ్ల్లాలన్నారు. దుబాయిలో వలస కార్మికులకు దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సభ్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రతి గల్ఫ్ బిడ్డ, ప్రవాసీలు చిరకాల కోరిక అయిన ఎన్‌ఆర్‌ఐ పాలసీని తీసుకురావడానికి రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు విన్నవించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సింగని రమేశ్ ఎన్‌ఆర్‌ఐ పాలసీపై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం శ్రీనన్న సేవాసమితి సభ్యులు తెలంగాణ వంటకాలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...