కూటమి కుట్రలను తిప్పికొట్టాలి

Sat,November 17, 2018 01:31 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ: 60 ఏళ్ల వెనుకబాటుకు కారణమైన పార్టీలు ఏకమై మహాకూటమిగా మరోసారి కుట్రలను పన్నుతున్నాయని వా టిని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం సంగీత నిలయంలో కోనరావుపేట మండలం వ ట్టిమల్ల గ్రామానికి చెందిన నాయిబ్రాహ్మణులు, నిజామాబాద్ గ్రామానికి చెందిన మున్నూరుకా పు సంఘం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరగా రమేశ్‌బాబు వారిని కం డువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడు తూ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా వెనుకబాటుకు గురిచేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జతకట్టి మళ్లీ కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో ప్రథమస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప ట్టం కట్టాలన్నారు. రైతుకు పంట పెట్టుబడి సహా యం, భీమా 24గంటల పాటు విద్యుత్‌ను అందజేయడమే కాకుండా సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా శరవేగం గా జరిపారన్నారు.

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 20న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభకు పెద్దెత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇక నాయిబ్రాహ్మణుల సం ఘం అధ్యక్షులు దేవయ్య, గంగాధర్, శ్రీనివాస్, శేఖర్, నారాయణ, తిరుపతి, కాపుసంఘం అధ్యక్షులు నారాయణ, ఈర్ల రవి, ఈర్ల లచ్చయ్య, ఈర్ల అంజయ్య, శంకరయ్య, మహేందర్, యూ త్ సభ్యులు ఈర్ల పర్శరాం, గుండా శ్రీకాంత్‌లతో పాటు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు న్యాలకొండ రాఘవరెడ్డి, జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, మాజీ జడ్పీటీసీ బండ నర్సయ్య యాదవ్, మంతెన సం తోశ్, దేవయ్యలతోపాటు ఉన్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles