ప్రజల రుణం తీర్చుకుంటా

Thu,November 15, 2018 12:59 AM

-భారీ మెజార్టీతో విజయం సాధిస్తా
- నియోజకవర్గ ప్రజలపై పూర్తి విశ్వాసం
- టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల
మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ/మెట్‌పల్లి టౌన్: తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నాలుగున్నరేళ్లలో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాననీ, మళ్లీ అవకాశం కల్పిస్తే సేవకుడిగా ప్రజల రుణం తీర్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మెట్‌పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి రెండో నామినేషన్ సెట్టును రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసిన ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై విశేష ఆదరణ పెరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వె ళ్లినా తిరగాల్సిన అవసరం లేదని మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ తమ ఓట్లు కా రు గుర్తుకు వేస్తామంటూ ప్రతి ఒక్కరూ చెబుతూ ఆశీర్వదిస్తున్నారన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కోరు ట్ల, మల్లాపూర్ మండలాల్లోని అన్ని గ్రామాలను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లానని, నాలుగున్నరేండ్లలో సుమారు రూ. 1700 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు.

వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అభయహ స్తం, బోధకాలు, చేనేత కార్మికుల కోసం నియోజకవర్గంలో ఆసరా పథకం కింద 80,277 మం దికి పింఛన్లు వస్తున్నాయని, పింఛన్లకు సంబంధించి ప్రతి నెల రూ. 12 కోట్లు లబ్ధిదారులకు ఇ వ్వడం జరుగుతున్నదని వెల్లడించారు. కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి, షాదీముబారక్ పథకం కింద వేలాది మంది పేద కుటుంబాలకు లబ్ధిచేకూర్చినట్లు తెలిపారు. రైతు బంధు పథకం కింద 51 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా ప్రజల వద్దకు వెళ్తే వారి చూపిస్తున్న ఆదరాభిమానాలతో ఒక్కోసారి ఆనందభాష్పాలు వస్తున్నాయన్నారు. ఆసరా పథకం కింద రూ. 1000 పింఛన్ ఇచ్చి కేసీఆర్ తమకు పెద్దకొడుకులా ఆదుకుంటున్నాడని, పింఛన్ రూ. 2000కు పెంచిన, పెంచకపోయినా ఫర్వాలేదు..ఆపదలో ఆదుకున్న సీఎం కేసీఆర్‌కే మా ఓట్లు అని ముక్త కంఠంతో చెబుతుండడం సంతోషంగా ఉందన్నారు. నామినేషన్ల మొదటి రోజు ఒక సెట్టు నామినేషన్ వేశానని, రెండో సెట్టు నామినేషన్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా దాఖలు చేయడం ఆనందంగా ఉందనీ, ఎంపీ రావడం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. 20 ఏండ్ల నా రాజకీయ జీవితంలో ఏడు సార్లు ఎన్నికల్లో కొట్లాడినా.. ప్రజల నాడీ తెలు సన్నారు. అహర్నిశలు కష్టపడి సేవలందిస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ
అంతకుమందు పట్టణంలోని వట్టివాగు సమీపంలో మహాలక్ష్మీ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో అంచనాలకు మించి అభివృద్ధి చేశామని తెలిపారు. ఆంధ్రా నాయకులు చేసిన వ్యాఖ్యలకు తిప్పి కొట్టే విధం గా తెలంగాణలో కేసీఆర్ ఎనలేని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో కొన్ని వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించామని వివరించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజలు తనకు మరో అవకాశాన్ని ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు ఎన్ని జిమ్మిక్కులు చేసిన టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇప్పటి వరకు కోరుట్ల ని యోజకవర్గంలో 80,270 మందిని అర్హులుగా గుర్తించి పింఛన్లను అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు.

అదే విధంగా సుమారు 4500 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాధీముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నా రు. సుమారు 3 వేల మందికి ము ఖ్యమంత్రి సహాయనిధి కింద పేద ప్రజలకు ఆర్థిక సహాయా న్ని అందించినట్లు తెలిపారు. సమావేశం ముగిసిన అనంత రం టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు ఐదు వేల మందితో భారీ ద్విచ క్ర వాహనర్యాలీ నిర్వహించారు. వట్టివాగు నుంచి బస్‌డిపో, పాత బస్టాండు, కొత్త బస్టాం డు, మండ ల పరిషత్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం మీదుగా సబ్ కలెక్టర్ కా ర్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. నాయకులు, కార్యకర్తలు నృత్యాలతో హోరెత్తించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు చేసిన నినాదాలు మెట్‌పల్లి పట్టణంలో మార్మోగాయి. ఆయా కార్యక్రమాల్లో మె ట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్లు మర్రి ఉమారాణి, శీలం వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు మార్గం గంగాధర్, ఎంపీపీ తుమ్మనపల్లి భారతి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు మారు సాయిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ద్యావతి అరుణ, టీ ఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, నాయకులు దారిశెట్టి రాజేశ్, అన్నం అనిల్, గఫార్, ఏ షమేని గణేశ్, ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్, సంజీవ్, గైని శ్రీనివాస్, మాధవ రెడ్డి, పిసు తిరుపతి రెడ్డి, తోట శ్రీనివాస్, డీలర్ మల్లయ్య, కట్కం నర్సరెడ్డి, ఏలేటి సంతోష్‌రెడ్డి, షేక్ నవాబ్, చెర్లపెల్లి అనంద్‌గౌడ్, తిరుమల్ రావు, చంద్రశేఖర్, సంగం సాగర్, నేమూరి సత్యనారాయణ, నగేంద్ర బాబు, రవి యాదవ్, కాటిపెల్లి రఘపతి రెడ్డి, మారు సాయిరెడ్డి, తెడ్డు సురక్ష, జంగ ద్యావతి సుదర్శన్, అల్లూరి రఘుపతిరెడ్డి, నేమూరి సత్యనారాయణ, సుగుణాకర్‌రావు, జేడీ సుమన్, ముదాం నర్సింలు, లిం గంపల్లి సంజీవ్, మురళీధర్‌రెడ్డి, పెంట లింబా ద్రి, ఎలాల దశరథరెడ్డి, వూటూరి ప్రదీప్‌కుమార్, జగన్‌రావు తదితరులున్నారు.

144
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles