నేడు నామినేషన్ల జాతర

Wed,November 14, 2018 12:55 AM

జగిత్యాల ప్రతినిధి/మెట్‌పల్లి నమస్తే తెలంగాణ/ సారంగాపూర్:జిల్లాలో ముగ్గురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు నేడు అట్టహాసంగా నామినేషన్లే వేసేందుకు భారీ ఏ ర్పాట్లు చేశారు. కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్, ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ నేడు నామినేషన్లు వేయనుండగా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కవిత హాజరుకానున్నారు. ఉదయం 11.30గంటలకు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఇంట్లో ప్రెస్‌మీట్, అనంతరం 1గంటకు కల్వకుంట్ల నామినేషన్ ప్రక్రియలో ఎంపీ పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు జగిత్యాలలో అభ్యర్థి సంజయ్‌కుమార్ నామినేషన్ వేయనుండగా ఈ కార్యక్రమానికిసైతం కవిత హాజరుకానున్నారు.

అనంతరం సారంగాపూర్ మం డ లం రేచపల్లిలో మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే బహిరంగ సభలో మంత్రి ఈటల రాజేందర్, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొంటారు. తర్వాత ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడే ఎంపీ కవిత ప్రెస్‌మీట్ నిర్వహించనున్నా రు. కల్వకుంట్ల నామినేషన్ కోసం టీఆర్‌ఎస్ నా యకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు.కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లో అన్ని గ్రామాల నుంచి వేలాది మంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ ఉత్సవానికి తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ చేసిన అనంతరం పట్టణ శివారులోని మహాలక్ష్మి ఆలయ సమీపంలో కార్యకర్తల సమావేశంలో విద్యాసాగర్‌రావు, ఎంపీ కవిత పాల్గొంటారు.

రేచపల్లిలో సభకు ఏర్పాట్లు
సారంగాపూర్ మండలం రేచపల్లిలో నేడు బ హిరంగ సభ నిర్వహణకు టీఆర్‌ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మంత్రి ఈటల రా జేందర్, ఎంపీ కవిత హాజరుకానున్నందున భారీ జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ శివారులో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న స్థ లంలో సభ వేదికను సిద్ధం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే బహిరంగ సభా ఏర్పాట్లను మంగళవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత ఓరుగంటి రమణారావు, డాక్టర్ శైలేందర్ రెడ్డి పరిశీలించారు. వారివెంట బీర్‌పూర్ సింగిల్ విం డో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు, మాజీ ఎం పీపీ కొల్ముల రమణ, తాజామాజీ సర్పంచ్ భూక్య లావణ్య రాథోడ్, ఎంపీటీ సీ సభ్యురాలు ఒడ్నాల లావణ్య, రైతు సమన్వయ సమితి గ్రామాధ్యక్షుడు మెడిపల్లి మనోహర్ రెడ్డి, బాలె సత్యనారాయణ, ఎడమల తిరుపతి రెడ్డి, బందెల రవి, రమేశ్, మంక్తు, రవీందర్, తి రుపతి, జగన్, కొమురయ్య, నర్సింహాచారి. ఉన్నారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles