ప్రచారంలో దూసుకుపోతున్న కారు

Wed,November 14, 2018 12:51 AM

మెట్‌పల్లి రూరల్: ఓవైపు నామినేషన్ల పర్వం ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా మహాకూటమిలో సీట్ల లెక్కలు తేలకపోగా, మరోవైపు ఎన్నికల పచారంలో కారు దూసుకుపోతోంది. నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయుధంగా చేసుకొని టీఆర్‌ఎస్ నాయకులు ఎ న్నికల ప్రచారంలో ముందుకు కదులుతున్నారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల వి ద్యాసాగర్‌రావుకు మద్దతుగా మంగళవారం మెట్‌పల్లి మం డలం రాంలచ్చక్కపేట, ఆత్మనగర్ గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, బీడీ కార్మికులను కలుస్తూ టీఆర్‌ఎస్ అమలు పరిచిన సంక్షే మ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు మ్యానిఫెస్టోను వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి కల్వకుంట్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీపీ రాచమల్ల సురేశ్, ఎంపీటీసీ సభ్యుడు గోపిడి జ గన్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ముదాం నర్సిం లు, రైతు సమన్వయ సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడు మారు సాయిరెడ్డి, నాయకులు పోతారపు రమేశ్, గుగ్లావత్ గోవింద్, పోత్కూరి శోభన్, పుల్ల జగన్‌గౌడ్, నల్ల తిరుపతిరెడ్డి, డబ్బ రాజరెడ్డి, కొట్టాల లింగారెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, చిట్యాల రాజారాం తదితరులున్నారు.
కోరుట్ల :మండలంలోని పైడిమడుగు గ్రామంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఇక్కడ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావ్, మండల ఉపాధ్యక్షుడు కాశీరెడ్డి మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ డైరెక్టర్ గుగ్గిల్ల సురేశ్‌గౌడ్, మండల రైతు సమన్వయ సమితీ అధ్యక్షుడు చింతకుంట సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నత్తి రాజ్‌కుమార్, మాజీ సర్పంచులు లంక చంద్ర, ఎండీ సలీం, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి,కుర్మ గంగారెడ్డి, గట్ల అనంతస్వామి, లంక తుక్కారాం, దార నర్సయ్య, కార్గోరు నర్సయ్య, ఆవునూరి కాశిరెడ్డి, గణేశ్‌రెడ్డి, తుమ్మనపెల్లి చంద్రప్రకాశ్, పల్లికొండ నరేశ్, బండి భూమయ్యగౌడ్, రాజేశంగౌడ్, ఆకుల గంగాధర్‌గౌడ్, సంకె రాకేశ్, మల్లారెడ్డి, తదితరులున్నారు.

కోరుట్లటౌన్: పట్టణంలోని 26వ వార్డులో మంగళవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును గెలిపించాలని మహిళా నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తున్న విద్యాసాగర్‌రావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కౌన్సిలర్ గండ్ర శిల్పారావు, మాజీ కౌన్సిలర్ అన్వర్, టీఆర్‌ఎస్ బీసీ నాయకులు శ్రీపతి, మహిళా నేతలు మెన్నేని శ్యామల, విజయ, రమ, ఉమ, శాంత, కవిత, వినోద, అజీజా, నాయకులు రాచకొండ నరేశ్, నందగిరి రవి, రాజోజి రమేశ్ తదితరులున్నారు.

ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట్ గ్రామంలో మంగళవారం టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు గెలుపు కోసం టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి విద్యాసాగర్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఎన్నడు లేని విధంగా అందిస్తున్న పింఛన్లను రెట్టింపు చేసి అందించనున్నారన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లాల దశరథరెడ్డి, ప్రధాన కార్యద ర్శి నేమూరి సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం సింగిల్‌విండో అధ్యక్షుడు అల్లూరి రఘుపతిరెడ్డి, మండల టీ ఆర్‌ఎస్ యూ త్ అధ్యక్షుడు కాశిరెడ్డి శేఖర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు జేడీ సుమన్, నాగులు, రేగొండ శ్రీనివాస్, రవికాంంత్ రెడ్డి, చంటి నర్సయ్య, కాశిరెడ్డి మోహన్‌రెడ్డి ఉన్నారు.

మల్లాపూర్:గొర్రెపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు మద్దతుగా మంగళవారం టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం ని ర్వహించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ను వివరించారు. ఇక్కడ టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఏను గు రాంరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు బద్దం నర్సారెడ్డి, రైతు సమన్వయసమితి జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, మండలాధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్ తోట శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ ఏలేటి రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కదుర్క నర్సయ్య, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వీవీప్యాట్లపై అవగాహన
మెట్‌పల్లి రూరల్: వెల్లుల్ల గ్రామంలో వీవీప్యాట్ యంత్రాలపై ఓటర్లకు ఎన్నికల సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. పారదర్శకతను పాటించేందుకే ఎన్నికల సం ఘం ఈ యంత్రాలను శాసనసభ ఎన్నికల్లో అమలు పరచనుందని వివరించారు. ఇక్కడ శిక్షకులు దేవరాజం, రాజేందర్, వీఆర్వోలు, బీఎల్వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎఖీన్‌పూర్‌లో..
కోరుట్ల: ఎఖీన్‌పూర్ గ్రామంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై ఓటర్లకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల మిషన్‌ల ద్వారాఎన్నికల్లో ఓటు వేసే పద్దతిని ఎపీఎం శంకర్ ఓటర్లకు వివరించారు.
కేసీఆర్ పథకాలే రమేశ్‌బాబును గెలిపిస్తాయి

మేడిపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వేములవాడ ఎమ్మెల్యేగా చెన్న మనేని రమేశ్‌బాబును గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ యూత్ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మాచాపూర్ గ్రామంలో మంగళ వారం ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రమేశ్‌బాబు చేసిన సేవలను వివరించా రు. ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ యూత్ గ్రామాధ్య క్షులు సాన వెంకటి, మగ్గిడి తిరుపతి, యూత్ వి భాగం గ్రామాధ్యక్షులు బోయిని గంగారెడ్డి, సాయి ని గంగారెడ్డి, నాయకులు దర్శనాల కాంతయ్య, రాజయ్య తదితరులున్నారు.

263
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles