స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి

Tue,November 13, 2018 12:54 AM

జగిత్యాల క్రైం : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్వేచ్చాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలని తెలంగాణ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ పోలీసు అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తుపై లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ సోమవారం జగిత్యాల పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవాలన్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలనీ, ఎక్కడ అవసరముంటే అక్కడ సీసీ కెమెరాలు అమర్చాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా, లేదా ఫిర్యాదు వచ్చినా వీడియో గ్రాఫ్, సీసీ పుటేజీ ఎంతో కీలకంగా మారుతుందన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న పో లింగ్ బూత్‌లను ఎల్లప్పుడు సందర్శిస్తూ, స్థానికులతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో పాటు సమాచార వ్యవస్థను పెంపొందించుకోవాలన్నారు.

శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ బూతుల వా రీగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతో పాటు అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచడంతో పాటు వారిని బైండోవర్ చేయాలన్నారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నేరస్థుల సమాచారాన్ని సేకరించి వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలనీ, పోలింగ్ కేం ద్రాల వారీగా రౌడీ షీటర్ల జాబితా రూపొందించుకొని వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లా పాలనాధికారుల ఆద్వర్యంలో డీఎస్పీ, సీఐ, ఎస్సైలు రెరవె న్యూ అధికారులు ఒక బృందంలాగా కలిసి పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమన్వయ పర్చుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేయాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ ఇన్సిడెంట్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అధికారులకు సిబ్బందికి పాత నేరస్తుల గురించి, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారి గురించి, రూట్ మొబైల్స్, పోలింగ్ బూత్‌ల గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, నియమాలకు అనుగుణంగా బందోబస్తు గురించి పోలీసు అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతమైన వాతావరణం సృష్టించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ సింధూశర్మ అడిషనల్ డీజీకి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ జిల్లాలో సమస్మాత్మక పో లింగ్ కంద్రాలు, సాధారణ పోలింగ్ కేంద్రాల గురించి సమాచారం సేకరించామని, సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేశామన్నారు. జిల్లా గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వా రు, బైండోవర్ల సమాచారం సేకరించామన్నారు.

పో లింగ్ కేంద్రాల పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేశామనీ, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించేందకు ఎంత మంది సిబ్బంది అవసరమనే విషయాన్ని నిర్దారించామన్నారు. జగిత్యాల, కోర్టుల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల వారీగా స మస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికనుగుణంగా రూట్ మొబైల్స్ గురించి, జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తుగా జిల్లాలోని అన్ని సరిహద్దుల్లో 6 చెక్ పో స్టులను ఏర్పాటు చేసి వాటికి జియో ట్యాగింగ్ చేశామనీ, ఈ చెక్ పోస్టుల్లో నిరంతరాయంగా వాహనాల తనిఖీ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఫ్లయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. వీడియో సర్వేలెన్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ సిబ్బందితో సమన్వయంగా విధులు నిర్వహిస్తున్నామనీ, జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రతి రోజు నిఘా పెట్టడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేసినట్లు పవర్ పాయింట్ ద్వారా ఎస్పీ సింధూశర్మ డీజీకి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో జగిత్యాల కలెక్టర్ డా. ఏ. శరత్, ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్‌కుమార్, అడిషనల్ ఎస్పీ మురళీధర్, డీఎస్పీలు వెంకటరమణ, మల్లారెడ్డి, ప్రతాప్, సీతారాములు, ఎస్బీసీఐ రాజశేఖర్‌రాజు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

151
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles